Share News

NRI TDP Europe: యూరప్‌లో ఘనంగా మహానాడు-2025

ABN , Publish Date - Jun 17 , 2025 | 09:40 AM

ఎన్నారై టీడీపీ యూరప్ ఆధ్వర్యంలో యూరప్‌లోని పలు నగరాల్లో మహానాడు వైభవంగా జరిగింది.

NRI TDP Europe: యూరప్‌లో ఘనంగా మహానాడు-2025
NRI TDP Europe Mahanadu

యూరప్, జూన్ 8, 2025: తెలుగు దేశం పార్టీ (NRI TDP Europe) ఆధ్వర్యంలో మహానాడు-2025 వేడుకలు డబ్లిన్ (ఐర్లాండ్), కోపెన్హాగన్ (డెన్మార్క్), వాలెట్టా (మాల్టా) నగరాల్లో జూన్ 8న ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమం తెలుగువారి ఐక్యతకు అద్దంపడుతూ, సామాజిక, రాజకీయ చైతన్యానికి వేదికగా నిలిచింది.

కార్యక్రమంలో ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ డెవలప్‌మెంట్ (పీపీడీ) వర్క్‌షాప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు, ఉద్యోగార్థులు, వీసా సందేహాలున్నవారికి 6 గంటలపాటు మెంటరింగ్ అండ్ మానిటరింగ్ ద్వారా మార్గదర్శకత్వం అందించారు.

తెలుగు మహిళలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, మహానాడును ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ 102వ జయంతి, ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం, నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం, పద్మభూషణ్ పురస్కారం సందర్భంగా కేక్ కటింగ్ వేడుక నిర్వహించారు.

2.jpg


ఈ కార్యక్రమానికి NRI TDP Ireland రీజినల్ కోఆర్డినేటర్ డా. కిషోర్ బాబు చలసాని నాయకత్వం వహించి సభ్యులను ఉద్దేశించి ముఖ్య ప్రసంగం చేశారు. ఐర్లాండ్ మహానాడు నిర్వహణతో పాటు మొత్తం యూరప్ స్థాయిలో సమన్వయంతో సమగ్రంగా ఈ మహానాడు విజయవంతంగా కొనసాగించేందుకు చొరవ చూపారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా APNRT చైర్మన్ డా. రవికుమార్ వేమూరి జూమ్ ద్వారా పాల్గొని TDP Ireland చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఇటువంటి వర్క్‌షాప్‌లకు ఒక ఎస్ఓఫీ (స్టాండర్డ్ ఆపరేసింగ్ ప్రొసీజర్) రూపొందించి పంపించాలని ఆదేశించారు.

ఈ ప్రతిపాదనలను విశ్లేషించి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారి కోసం భవిష్యత్తులో ఇతర దేశాల్లో కూడా అమలు చేద్దామన్నారు. సీఎక్స్‌ఓ క్లబ్, వృత్తి అభివృద్ధి వేదికల ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన 2 మిలియన్ ఉద్యోగాల లక్ష్యాన్ని సాధించేందుకు ఈ వర్క్‌షాప్ తోడ్పడుతుందని తెలిపారు.

ఎక్స్‌‌పోర్టు-ఇంపోర్టు బిజినెస్ అభివృద్ధికి ఏపీఎన్‌ఆర్‌టీ దోహదపడుతుందని, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్నారైలు అర్ధ భాగస్వాములు అయితే సగ భాగాన్ని ఏపీఎన్ఆర్‌టీ భరించేలా ప్రోత్సాహం ఉంటుందని హామీ ఇచ్చారు.

5.jpg

ఏపీఎన్‌ఆర్‌టీ డైరెక్టర్ (ఇన్వెస్ట్‌‌‌మెంట్స్) శేషుబాబు కానూరి కూడా అతిథిగా హాజరై, ఎన్నారైలంతా ఏపీఎన్ఆర్‌టీ భాగస్వాములుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మహానాడు ఘనంగా నిర్వహించినందుకు టీడీపీ యూరప్ కృషిని ప్రశంచించారు.

కాట్రగడ్డ వేంకట కృష్ణ ప్రసాద్ ఏపీఎన్‌ఆర్‌టీ సభ్యులకు లభించే ఉపయోగాలు, ప్రోత్సాహకాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ యూరప్ నాయకులూ విజయ్ అడుసుమిల్లి , శ్యామ్ సుందర్ ఉట్ల , శ్రీనివాస్ గోగినేని, చందు కాట్రగడ్డ, స్వాతి రెడ్డి జూమ్ ద్వారా పాల్గొన్నారు.

మహానాడు 2025లో ఆమోదం లభించిన ముఖ్య తీర్మానాలు

  • టీడీపీ ఐర్లాండ్ అండ్ యూరప్ సభ్యత్వ విస్తరణ

  • గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

  • వార్షిక ప్రోగ్రామ్స్ కమిటీ ఏర్పాటు

  • ఈవెంట్ క్యాలెండర్ ఆవిష్కరణ

  • నెట్‌వర్కింగ్ అండ్ కమ్యూనికేషన్ మెరుగుదల

ఈ మహానాడు కార్యక్రమం యువతలో చైతన్యం నింపుతూ, పరస్పర సహకారంతో, విశాల దృష్టితో, టీమ్ యూరప్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. అంతేకాక షడ్రుచులతో పసందైన విందు భోజనం ఏర్పాటుచేశారు.

6.jpg


విజయవంతమైన నిర్వహణకు కృషి చేసిన సభ్యులు:

ఐర్లాండ్

  • శ్రీనివాస్ పుట్టా

  • కిషోర్ బాబు చలసాని

  • వేంకట కృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ

  • అచ్చుత కిషోర్ కొత్తపల్లి

  • భరత్ భాష్యం (ఐర్లాండ్ అధ్యక్షులు )

  • రాజేష్ బాబు పల్లేటి

  • దీప్తి కొణిదల

  • శివ వేములపల్లి

  • కోటేంద్ర లేళ్ల

  • రంగ గల్లా

  • ప్రముఖ్ గోగినేని

  • శ్రీను శ్రీను

  • శుభాకర్ రామినేని

  • హరీష్ గణపనేని

  • రామ్ వంగవోలు

  • శ్రీకర్ మల్లికార్జున్ గుత్తా

డెన్మార్క్:

  • అమర్నాథ్ పొట్లూరి

  • యాగంటి బాలకృష్ణ

  • హరి చెరుకూరి

మాల్టా:

  • సుమంత్ బాబు పద్మాల

  • సతీష్ ముళ్ళపూడి

  • షేక్ అజహరుద్దీన్

  • లత ముళ్ళపూడి

  • నరేష్ చౌదరి తలపనేని

  • గౌరవ్ జోషి

3.jpg1.jpg

ఇవి కూడా చదవండి:

బే ఏరియాలో ఘనంగా కృష్ణ 82వ జయంతి వేడుకలు

తానా మహాసభలకు వస్తున్న తారలు

Read Latest and NRI News

Updated Date - Jun 17 , 2025 | 12:38 PM