NRI: ఫ్లోరిడాలో హర్‌హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్
ABN , Publish Date - Mar 10 , 2025 | 12:42 PM
ఓర్లాండో నగరంలో హెల్త్ హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ - 2025 విజయవంతంగా జరిగింది. పలువురు ప్రముఖులు ఈ రంగంలో తమ అనుభవాలను పంచుకున్నారు.

ఫ్లోరిడాలో హర్‌హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ - 2025 విజయవంతమైందని శంకర్ నేత్రాలయ యూఎస్ఏ చైర్‌పర్సన్ ఈమెడ్ సీఈఓ డాక్టర్ ప్రియా కొర్రపాటి అన్నారు. ఈ సదస్సు తన విజన్‌ను నిజం చేసిందని వ్యాఖ్యానించారు. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, విద్యనందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్‌పర్సన్‌గగా, ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి తనకు ఈ కార్యక్రమం ఓ సదవకాశమని వ్యాఖ్యానించారు.
ఈ కాన్‌ఫరెన్స్‌లో అతిథులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్‌కి వేదికగా పనిచేసింది. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ ఏఎమ్ఏ ఉపాధ్యక్షురాలు స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో వేదిక మొదలైంది. వీరు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.
NRI: డిట్రాయిట్ వేదికగా తానా పండుగకు సన్నాహాలు ప్రారంభం
గౌరవనీయ చైర్‌పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, ఏఏపీఐ అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్‌లను పరిష్కరించడం, నిరంతర అవగాహన అవసరం ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్‌లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని అన్నారు . హాజరైన వారు 10 గంటల సీఎమ్ఏ క్రెడిట్‌లను సంపాదించారు. ఈ కాంగ్రెస్‌ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేసిందని అన్నారు. ఆయన ఏఏపీఐ, సీఏపీఐ (టంపా నుండి స్థానిక అధ్యాయం) ఈమెడ్ ఈడీతో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను అభినందించారు.
ప్రత్యేక ఆకర్షణలు;
ఎన్ఎఫ్ఎల్ ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సుకి అదనపు ఆకర్షణగా నిలిచారు. క్యాన్సర్‌పై ప్రజా అవగాహన, సమాజ భాగస్వామ్యం గురించి ఆయన మాట్లాడటం చాలా ఆసక్తిగా అనిపించింది. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరొక ఆకర్షణగా నిలిచింది. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు.
డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకలాజికల్ ఆంకాలజీ సెషన్ నిజంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. క్యాన్సర్ కేర్‌లో మెడికల్ ట్రీట్‌మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించడం ఈ సెషన్ ముఖ్యాంశము.
వాలంటీర్ల దృక్పథం
స్పీకర్లకు మించి, కాంగ్రెస్ తమ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందని ప్రియా కొర్రపాటి అన్నారు. సెషన్‌లు, ఆసక్తికరమైన చర్చలు, డాక్టర్ల నైపుణ్యం పట్ల వారి ప్రశంసను పంచుకున్నారు. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిష్కారాలు ఇచ్చారని, ప్రశ్నోత్తరాల సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని తెలియజేసారు.
NRI: టాంటెక్స్ ఆధ్వర్యంలో ‘కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు’
ఆడియెన్స్ అభిప్రాయాలు
కాన్ఫరెన్స్ ప్రముఖ వక్తలలో ఒకరు, మహిళల క్యాన్సర్‌లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్‌లు, ప్రైమరీ కేర్ డాక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి అనే అంశాలను ఎలా ఈ కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించారో తమ అభిప్రాయాల ద్వారా తెలియచెప్పారు.
హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు
ఈ ఏడాది కాంఫరెన్స్ ముగిస్తూనే, 2026 కోసం ఎదురుచూస్తున్నామని ప్రియా కొర్రపాటి అన్నారు. వచ్చే సంవత్సరం కార్యక్రమం ఓహియోలో జరుగుతుందని చెప్పారు. అక్కడ ఇంకాస్త ఎక్కువగా అందరినీ చేరుకోవడానికి ప్రయత్నిస్తాము. ఈ కార్యక్రమం విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ అంకితభావం మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్‌లో ముందుకు సాగడానికి స్ఫూర్తిని ఇస్తుందన్నారు. ఇప్పుడున్న ఆంకాలజీని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి..