NRI: గల్ఫ్ జనసేన పార్టీ ఆత్మీయ సదస్సు
ABN , Publish Date - Jun 08 , 2025 | 10:09 PM
గల్ఫ్ జనసేన పార్టీ - సౌదీ అరేబియా సెంట్రల్ రీజియన్ రియాద్‌లో బక్రీద్ పండుగ శుభ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణుల ఆత్మీయ సదస్సును ఘనంగా జరుపుకున్నారు.
గల్ఫ్ జనసేన పార్టీ - సౌదీ అరేబియా సెంట్రల్ రీజియన్ రియాద్‌లో బక్రీద్ పండుగ శుభ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణుల ఆత్మీయ సదస్సును ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గల్ఫ్ జనసేన- సౌదీ అరేబియా కన్వీనర్ అమీర్ ఖాన్ పార్టీ కార్యకర్తలు, వీర మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. సభ మధ్యలో దుబాయ్ నుండి గల్ఫ్ జనసేన పార్టీ నేషనల్ కన్వీనర్, ఇంచార్జ్ కేసరి త్రిమూర్తులు, కువైట్ నుంచి నేషనల్ కన్వీనర్లు కంచన శ్రీకాంత్, రామచంద్ర నాయక్, బహ్రెయిన్ నుండి నేషనల్ కన్వీనర్ చందక రాందాస్, ప.గో.జిల్లా జనసేన నాయకులు, జిల్లా కాపు యువత అధ్యక్షులు మారిశెట్టి అజయ్ బాబు వీడియో కాల్ ద్వారా ప్రసంగించి తమ శుభాకాంక్షలు తెలియ చేసి దిశానిర్దేశం చేసారు.

సభను దుగ్గపు ఉష స్వాగతోపన్యాసంతో ప్రారంభించారు. చేతన కార్యకమాన్ని సమన్వయపరుస్తూ తాటికాయల మురారిని, గుండుబోగుల రమ్యని, గురు కిరణ్‌ని, శ్రీ సీతారామ్‌ని, గోవింద్‌ని సభకు పరిచయం చేశారు. గురు కిరణ్, భవన నిర్మాణ కార్మికుల తరపున రావూరి శ్రీనివాస్, వారి మిత్రబృందం ఐనా చౌదరి, వీరన్న కలిసి చేసిన ఈ కార్యక్రమ ఏర్పాట్లకు ధన్యవాదాలు తెలియచేశారు. సదస్సుకు ఎంతోమంది వీర మహిళలు, జన సైనికులు హాజరై కార్యక్రమాన్ని ఎంతో క్రమశిక్షణతో జయప్రదం చేశారు. అమీర్ ఖాన్ తన మాటల్లో రంజిత్, మల్లేష్, స్వామిలను పరోక్షంగా జనసేన పార్టీకి చేస్తున్న సహాయ సహకారాలను, ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో వేయబోయే కమిటీనీ ఉద్దేశించి నియమితమయ్యే సభ్యుల బాధ్యతలను, వారి విధి విధానాలను తెలియజేస్తూ దిశా నిర్దేశం చేసారు. విచ్చేసిన ప్రతి ఒక్కరినీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియ చేసారు.


ఇవి కూడా చదవండి:
రియాధ్‌లో టాసా ప్రతినిధుల సమావేశం
అమెరికాలో భారతీయ యువతికి షాక్.. ఏకంగా 5 వేల డాలర్ల నష్టం