Share News

NRI: ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో వైభవంగా తెలుగు సాంస్కృతిక ఉత్సవం

ABN , Publish Date - Sep 08 , 2025 | 03:47 PM

వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి జయంతిని ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య వైభవంగా నిర్వహించింది. ఈ సందర్భంగా తెలుగు భాషను నేర్చుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను సంస్థ స్థాపక సభ్యురాలు జయ పీసపాటి వివరించారు.

NRI: ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో వైభవంగా తెలుగు సాంస్కృతిక ఉత్సవం
Gidugu Ramamurthy Jayanti

ఇంటర్నెట్ డెస్క్: వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి జయంతిని ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య.. తెలుగు సాంస్కృతిక ఉత్సవంగా జరుపుకుంది. గిడుగు సేవలను తెలుపుతూ, తెలుగు భాషను నేర్చుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను సంస్థ స్థాపక సభ్యురాలు జయ పీసపాటి వివరించారు. ఈ సందర్భంగా పిల్లలు తెలుగు భాష, సంస్కృతి వారసత్వాన్ని ప్రదర్శిస్తూ క్లాసికల్, సెమీ క్లాసికల్, జానపద, టాలీవుడ్ పాటలు, నృత్యాలను ఘనంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కవితలు, కథా విన్యాసాలు కూడా నిర్వహించారు. పిల్లలకు చిత్రకళా పోటీలు కూడా నిర్వహించారు.


ప్రతి సంవత్సరం ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా పిల్లలను వారి అభిరుచుల్ని, కళలను ప్రోత్సహించడాన్ని సమర్థిస్తున్నామని, దాదాపు రెండు దశాబ్దాలుగా వారాంతాల్లో తెలుగు తరగతులు నిర్వహిస్తున్నామని, తమ సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారని జయ పీసపాటి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించిన తమ కార్యవర్గ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. భాష నేర్చుకోవడంలో ముందడుగు వేయడానికి ఉత్సాహం చూపిస్తున్నందుకు పిల్లలని, వారి తల్లిదండ్రులను అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మొత్తం 207 దేశాల్లో భారత సంతతి ప్రజలు.. కేంద్ర గణాంకాల్లో వెల్లడి

బహిరంగ మూత్ర విసర్జన వద్దన్నందుకు కాల్పులు.. అమెరికాలో భారతీయ యువకుడి మృతి

Read Latest and NRI News

Updated Date - Sep 08 , 2025 | 08:02 PM