USA: అమెరికాలో ఘనంగా చవితి వేడుకలు
ABN , Publish Date - Sep 04 , 2025 | 11:19 PM
అమెరికాలోని న్యూ హాంప్‌షైర్ నగరంలోని రివియర్ యూనివర్సిటీ ప్రాంగణంలో గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు స్థానిక గణేశ్ ఉత్సవ కమిటీ ఈ వేడుకలను వైభవంగా నిర్వహించింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని న్యూ హాంప్‌షైర్ నగరంలోని రివియర్ యూనివర్సిటీ ప్రాంగణంలో గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. న్యూ హాంప్‌షైర్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు గణేశ్ ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. స్థానికులు, విద్యార్థులు, కుటుంబాలు పాల్గొని భారతీయ సంస్కృతి, సంప్రదాయాల నడుమ ఈ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన ముత్యాల కావ్య, వరకంఠం శ్రీ సహిత్య, ఊటుకూరి జయంత్, పగడాల రఘు, కొసనా ఉమేష్ కృష్ణ, ముత్యాల వెంకట రాహుల్, సాయి నిఖిల్, అజయ్ కలిసి గణపతి లడ్డూను 5,216 డాలర్లకు (దాదాపు రూ.4 లక్షలకు) దక్కించుకున్నారు. అనంతరం నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నిరుద్యోగులతో చెలగాటం.. సౌదీలో తెలుగు ప్రవాసీ సంఘం ప్రచార ఆరాటం
గల్ఫ్ దేశాలు తెలంగాణ వారికి ఉపాధిని ఇచ్చే కల్పతరువు: మంత్రి గడ్డం వివేక్