Share News

TANA: విద్యార్థి ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం

ABN , Publish Date - Sep 09 , 2025 | 08:44 PM

చదువుల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్న కర్నూల్ విద్యార్థిని రవి పొట్లూరి ఆర్థికసాయం అందించారు. రూ.1.5 లక్షల సాయంతో అతడిని ఇంటర్మీడియట్‌లో చేర్పించారు.

TANA: విద్యార్థి ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం
TANA Pothluri Ravi

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డ్‌ ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి, విద్యార్థుల చదువుకు సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కప్పట్రాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థి కె. ఈరన్న ఇంటర్మీడియెట్‌ విద్యాభ్యాసానికి రవి పొట్లూరి రూ. 1.5 లక్షలు సహాయం అందించి మోషన్ రెసిడెన్షియల్ కాలేజీలో చదివిస్తున్నారు. రవి పొట్లూరి ప్రోత్సాహంతో ఈరన్న ఇంటర్మీడియెట్‌ బైపీసీ మొదటి సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించి 440 మార్కులకు గాను 425 మార్కులు సాధించాడు.


ఈరన్న చదువులో రాణించడం పట్ల రవి పొట్లూరి సంతోషం వ్యక్తం చేస్తూ ఈరన్నను అభినందించారు. కప్పట్రాళ్ళ గ్రామంలో పదవతరగతిలో టాపర్‌‌గా నిలిచిన ఈరన్న ప్రతిభను గమనించి రవి పొట్లూరి ఇంటర్మీడియెట్‌ చదువుకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఈరన్న మాట్లాడుతూ, రవి పొట్లూరి సహాయం మరువలేనిదని, ఆర్థికంగా వెనుకబడిన తనలాంటి విద్యార్థులకు ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపాడు. డాక్టర్ అవ్వాలనేది తన కోరిక అని, కష్టపడి చదువుకుని డాక్టర్ సీటు సాధించడానికి కృషి చేస్తానని తెలిపాడు. ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహించడానికి తన వంతు కృషి చేస్తూనే ఉంటానని రవి పొట్లూరి అన్నారు. ఇందుకు సహకరిస్తున్న తానా ఫౌండేషన్ శశికాంత్ వల్లేపల్లికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముప్పా రాజశేఖర్, మోషన్ రెసిడెన్షియల్ కళాశాల కరస్పాండెంట్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

గల్ఫ్‌లో గణనాథుల ఆరాధన.. కార్యక్రమాలను ముందుండి నడిపించిన గోదావరి జిల్లాల ఎన్నారైలు

భారతీయులకు మద్దతుగా అమెరికన్.. వాళ్లను పంపించేస్తే అమెరికాకే నష్టం అంటూ పోస్టు

Read Latest and NRI News

Updated Date - Sep 09 , 2025 | 10:03 PM