Amaravati: అమరావతి పునఃప్రారంభోత్సవ సభ.. భారీగా తరలివచ్చిన ఎన్నారైలు
ABN , Publish Date - May 02 , 2025 | 09:15 PM
ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవ సభకు ఎన్నారైలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొన్నారు.
అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చారు. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలతో పాటు విదేశాల నుంచి టీడీపీ ఎన్నారై నేతలు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. అమెరికా, గల్ఫ్ దేశాలు (సౌదీ అరేబియా, కువైట్, బెహ్రయిన్, దుబాయ్, కతర్, ఒమన్), యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేసియా దేశాల నుంచి ఎన్నారైలు అమరావతికి తరలివచ్చారు.
ఎన్నారై మీడియా కోఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని, గల్ఫ్ ఎన్నారై టీడీపీ అధ్యక్షులు రాధాకృష్ణ, ఎన్నారై గల్ఫ్ కంట్రీస్ నేతలు రహమతుల్లా, బాషా, బాలకృష్ణ, పలువురు ఎన్నారై టీడీపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎన్నార్టీ ఐకాన్ టవర్స్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పునఃప్రారంభం కాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రధాని వంటి డైనమిక్ లీడర్ చేతుల మీదుగా ఎన్నార్టీ ఐకాన్ టవర్స్ నిర్మాణ పనులు రీలాంచ్ కాబోతుండడం తమకు గొప్ప గౌరవమని ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. ఐకాన్ టవర్స్ ప్రాజెక్టు రీలాంచ్ కాబోతుండడంపై ఏపీ ఎన్నార్టీ ఎక్స్ ఛైర్మన్ డాక్టర్ రవి వేమూరు హర్షం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
బహ్రెయిన్‌లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు
జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్
డల్లాస్ ఈద్ మిలాప్ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి డా.పెమ్మసాని