Winter diet: చలికాలంలో ఇవి తినొద్దు..!
ABN , Publish Date - Dec 24 , 2025 | 06:20 AM
శీతాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఏవి తినకూడదో తెలుసుకుందాం......
శీతాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఏవి తినకూడదో తెలుసుకుందాం...
ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింక్స్, కూల్ కేక్‌లు, స్వీట్లు తీసుకోకూడదు. వీటివల్ల శరీరంలో శ్లేష్మం ఉత్పత్తి పెరిగి జలుబు, దగ్గు వస్తాయి. ఫ్రిజ్‌లో నుంచి తీసిన ఆహార పదార్థాలను కొద్దిసేపు బయట ఉంచి గది ఉష్ణోగ్రతకు వచ్చిన తరువాతనే తినాలి.
రాత్రి సమయంలో పెరుగు తినకూడదు. పలుచని మజ్జిగను మితంగా తీసుకోవచ్చు. వీటివల్ల కఫం పెరిగి ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు రావచ్చు.
నూనెలో వేయించిన పదార్థాలను తినకూడదు. వీటివల్ల కడుపులో ఆమ్లత్వం, ఉబ్బరం, అజీర్తి లాంటి సమస్యలు ఏర్పడవచ్చు
చలిగా ఉందంటూ ఎక్కువగా టీ, కాఫీ తాగకూడదు. వీటివల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్యలు ఏర్పడతాయి.
ద్రాక్ష, కమలాలు, బత్తాయి లాంటి సిట్రస్ పండ్లను ఎక్కువగా తినకూడదు. వీటివల్ల గొంతునొప్పి, కడుపులో మంట రావచ్చు. వీటిని మితంగా మధ్యాహ్నం సమయంలో తీసుకోవచ్చు.
వంటకాల్లో ఎక్కువగా కారం, ఘాటైన మసాలాలు వాడకూడదు. వీటివల్ల పలు జీర్ణాశయ సమస్యలు ఏర్పడతాయి. అల్లం, దాల్చిన చెక్క, మిరియాలు వాడుకోవచ్చు.