Share News

Natural Remedies: లైటు పురుగులతో ఇబ్బందా..!

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:54 PM

కిటికీలు, తలుపులు మూసినప్పటికీ ఏదోవిధంగా ఇంట్లోకి చొరబడుతూనే ఉంటాయి. వీటి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వీటిని నివారించడానికి రసాయనాలతో కూడిన స్ర్పేలు, కాయిల్స్‌ ఉపయోగించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

Natural Remedies: లైటు పురుగులతో ఇబ్బందా..!

సాయంత్రం పూట ఇంట్లో బల్బులు వెలగగానే వాటి చుట్టూ రకరకాల పురుగులు, కీటకాలు చేరుతుంటాయి. కిటికీలు, తలుపులు మూసినప్పటికీ ఏదోవిధంగా ఇంట్లోకి చొరబడుతూనే ఉంటాయి. వీటి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వీటిని నివారించడానికి రసాయనాలతో కూడిన స్ర్పేలు, కాయిల్స్‌ ఉపయోగించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఉండే వాటితోనే కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్యను పరిష్క

రించుకోవచ్చు.

వేపనూనె వాసన ఘాటుగా ఉంటుంది. ఈ వాసన కీటకాలకు నచ్చదు. ఒక స్ర్పే బాటిల్‌ తీసుకుని అందులో నాలుగు చెంచాల వేపనూనె వేసి బాటిల్‌ నిండుగా నీరు పోసి బాగా కలపాలి. వెంటిలేటర్లు, కిటికీ ఊచలు, ఇంటి తలుపుల వద్ద ఈ నీటిని పిచికారీ చేస్తే పురుగులు లోపలికి రావు. వేపనూనెకు బదులు లావెండర్‌ నూనె లేదా పిప్పరమెంట్‌ నూనె ఉపయోగించుకోవచ్చు.

స్టవ్‌ మీద గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసు నీళ్లు పోయాలి. అందులో పన్నెండు వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి వేసి మరిగించాలి. ఈ నీళ్లు కొద్దిగా చల్లారాక స్ర్పే బాటిల్‌లో పోసి పురుగులు, దోమలు వచ్చే ప్రదేశాల్లో పిచికారీ చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.


ఒక గ్లాసు నీళ్లలో పది హారతి కర్పూరం బిళ్లలు వేసి కరిగించాలి. ఈ నీళ్లను స్ర్పే బాటిల్‌లో పోసి ఇంట్లోని అన్ని మూలల్లో పిచికారీ చేయాలి. కర్పూరం వాసనకు దోమలు, ఈగలు, ఇతర లైటు పురుగులు ఇంట్లో నుంచి పారిపోతాయి. గది మూలల్లో మట్టి ప్రమిదలు ఉంచి వాటిలో ఒకటి లేదా రెండు హారతి కర్పూరం బిళ్లలు వేసి వెలిగించినా మంచి ప్రయోజనం ఉంటుంది.

అయిదు లవంగాలను కొద్దిగా వేడిచేసి మెత్తగా నూరి ఒక గ్లాసు నీళ్లలో కలపాలి. ఈ నీటిని ఇంటి గడప ముందు, కిటికీ తలుపుల వద్ద చల్లితే లవంగాల ఘాటుకి పురుగులు లోపలికి రావు.

ఒక స్ర్పే బాటిల్‌లో కొన్ని నీళ్లు, రెండు చెంచాల బేకింగ్‌ సోడా, నాలుగు చెంచాల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ ద్రావణాన్ని ఇంట్లో ట్యూబ్‌లైట్లు, బల్బుల చుట్టూ పిచికారీ చేస్తే పురుగులు దూరంగా వెళ్లిపోతాయి.


మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: మంత్రులకు ర్యాంకులు.. టాప్.. లాస్ట్ ఎవరంటే..?

Also Read: అక్రమవలస దారులకు సంకెళ్లు.. స్పందించిన విదేశాంగ మంత్రి

Also Read: విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచడానికి వీలు లేదు

Also Read: మాదాపూర్‌లో మళ్లీ డ్రగ్స్ పట్టివేత

Updated Date - Feb 07 , 2025 | 11:54 PM