Share News

Toe rings have returned as a popular fashion trend: మనసు దోచే మట్టెలు

ABN , Publish Date - Dec 03 , 2025 | 03:09 AM

కాలి వేళ్లకు ధరించే మట్టెలు తాజా ఫ్యాషన్‌గా మారిపోయాయి. వెండితో పాటు బంగారంతోనూ రూపొందుతున్న ఈ మట్టెలు, పలు రకాల డిజైన్లతో మహిళల మనసులను దోచుకుంటున్నాయి. అలాంటి కొన్ని టో రింగ్స్‌ మీకోసం...

Toe rings have returned as a popular fashion trend: మనసు దోచే మట్టెలు

కాలి వేళ్లకు ధరించే మట్టెలు తాజా ఫ్యాషన్‌గా మారిపోయాయి. వెండితో పాటు బంగారంతోనూ రూపొందుతున్న ఈ మట్టెలు, పలు రకాల డిజైన్లతో మహిళల మనసులను దోచుకుంటున్నాయి. అలాంటి కొన్ని టో రింగ్స్‌ మీకోసం...

పెళ్లైన హిందూ మహిళలు తప్పనిసరిగా ధరించే ఆభరణమిది. వీటిని ధరించడం వెనక కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. పాదంలోని రెండో వేలుకు ధరించే మట్టెలతో కీలకమైన నాడులు ప్రేరేపితమై పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని అంటారు. తాజాగా మట్టెల ఫ్యాషన్‌ మళ్లీ ఊపందుకుంది. ఎనామిల్‌, జాతిరాళ్లను పొదిగి తయారుచేసే మట్టెలు మార్కెట్లో దొరుకుతున్నాయి. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో ఆకట్టుకునే మెట్టెలు కొనడాన్ని తెలివైన పెట్టుబడిగానే భావించవచ్చు. తాజాగా ట్రెండ్‌ అవుతున్న మట్టెలను ఎంచుకోవడంలో కొన్ని చిట్కాలు పాటిస్తే, ట్రెండ్‌ సెటర్‌గా కూడా మారిపోవచ్చు. అవేంటో తెలుసుకుందాం!

  • ధరించే దుస్తులకు తగిన మట్టెలు ఎంచుకోవాలి. చీరకట్టుకు సంప్రదాయబద్ధంగా కనిపించే వెండి మట్టెలు బాగుంటాయి. మువ్వలు, వంకీల మట్టెలు చాలా బాగా నప్పుతాయి

  • ఆధునిక దుస్తులతో ధరించే మట్టెలు కూడా ఆధునికంగానే ఉండాలి. వీలైనంత సన్నగా, ట్రెండీగా ఉండే మట్టెలు ఎంచుకోవాలి. రంగురంగుల ఎనామిల్‌ కలిగిన మట్టెలు డ్రస్సులతో మ్యాచ్‌ అవుతాయి

  • కాళ్లకు బంగారం ఆభరణాలు పెట్టుకోకూడదనే నమ్మకాలకు రోజులు చెల్లాయి. కాబట్టి మట్టెల విషయంలో ఈ నియమం పాటించవలసిన అవసరం లేదు

  • పార్టీ వేర్‌ ధరించినప్పుడు కాస్త భారీగా ఉండే రాళ్ల మట్టెలు ఎంచుకోవచ్చు

  • మట్టెలు, పట్టీలు సరిజోడి కాబట్టి రెండూ మ్యాచ్‌ అయ్యేలా చూసుకుంటే పాదాల అందం రెట్టింపు అవుతుంది

  • మువ్వల పట్టీలు వినసొంపైన ధ్వనిని వెలువరిస్తాయి. వీటికి అదే తరహా మట్టెలు జోడించుకోవచ్చు.

Updated Date - Dec 03 , 2025 | 03:09 AM