Share News

Steel Sink Sparkling Clean: స్టీల్‌ సింక్‌ తళ తళ

ABN , Publish Date - Nov 13 , 2025 | 06:17 AM

చాలామంది వంటింట్లో స్టీల్‌ సింక్‌ను ఏర్పాటు చేసుకోవడానికే ఇష్టపడుతుంటారు. రోజూ సరైన విధానంలో శుభ్రం చేయకపోతే స్టీల్‌ సింక్‌ మొత్తం మరకలతో నిండిపోతుంది. అలాకాకుండా స్టీల్‌ సింక్‌ ఎప్పుడూ తళ తళలాడుతూ ఉండాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం...

Steel Sink Sparkling Clean:  స్టీల్‌ సింక్‌ తళ తళ

చాలామంది వంటింట్లో స్టీల్‌ సింక్‌ను ఏర్పాటు చేసుకోవడానికే ఇష్టపడుతుంటారు. రోజూ సరైన విధానంలో శుభ్రం చేయకపోతే స్టీల్‌ సింక్‌ మొత్తం మరకలతో నిండిపోతుంది. అలాకాకుండా స్టీల్‌ సింక్‌ ఎప్పుడూ తళ తళలాడుతూ ఉండాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం...

  • ఒక పళ్లెంలో రెండు చెంచాల ఉప్పు వేసి సగానికి కోసిన నిమ్మచెక్కతో అద్దాలి. దీంతో స్టీల్‌ సింక్‌ను రుద్దితే మరకలు, మురికి వెంటనే వదిలిపోతాయి. సింక్‌ చక్కగా మెరుస్తుంది.

  • తరచూ సింక్‌లో గోరువెచ్చని నీటిని పోస్తూ ఉండాలి. దీనివల్ల డ్రెయిన్‌లో చిక్కుకున్న వ్యర్థాలన్నీ తొలగిపోతాయి. సింక్‌ నుంచి దుర్వాసన రాదు. తరువాత లిక్విడ్‌ డిటర్జెంట్‌లో అద్దిన స్క్రబ్బర్‌తో తోమితే సింక్‌ మీద పేరుకున్న జిడ్డు త్వరగా వదులుతుంది. ఆపైన సింక్‌ తళ తళలాడుతుంది.

  • చిన్న గిన్నెలో రెండు చెంచాల బేకింగ్‌ సోడా, నాలుగు చెంచాల వెనిగర్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాత టూత్‌బ్రష్‌ సహాయంతో సింక్‌ మొత్తానికి పట్టించాలి. పావు గంట తరువాత స్క్రబ్బర్‌తో తోమితే మరకలు పూర్తిగా వదిలి సింక్‌ శుభ్రంగా కనిపిస్తుంది.

  • సింక్‌లో మెత్తటి ఉప్పు, ముగ్గు, బ్లీచింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడాలలో ఒకటి చల్లి పాత టూత్‌బ్రష్‌తో రుద్దినా మరకలు తొలగిపోతాయి.

Updated Date - Nov 13 , 2025 | 06:17 AM