Share News

వారు శాశ్వతులు

ABN , Publish Date - Mar 07 , 2025 | 07:02 AM

సుకృతాత్ములు రససిద్ధులు సుకవీంద్రులు విజయ నిధులు సుమ్ము తదీయా ధిక కీర్తి శరీరంబులు ప్రకట జరామరణ జన్మ భయ రహితంబుల్‌...

వారు శాశ్వతులు

సుభాషితం

సుకృతాత్ములు రససిద్ధులు సుకవీంద్రులు విజయ నిధులు సుమ్ము తదీయా ధిక కీర్తి శరీరంబులు ప్రకట జరామరణ జన్మ భయ రహితంబుల్‌ ఈ పద్యం... భర్తృహరి రచించిన ‘నీతిశతకం’లో సుప్రసిద్ధమైన ‘జయంతితే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః... నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం’ అనే శ్లోకానికి ఏనుగు లక్ష్మణకవి చేసిన తెలుగు అనువాదం.

భావం: గొప్ప కావ్యాలు రచించిన కవీంద్రులు ధన్యులు, తమ గ్రంథాల ద్వారా వారు సాధించిన రససిద్ధి ద్వారా శాశ్వతులు. వారి కీర్తి శరీరాలకు చావు పుట్టుకలనేవి ఉండవు. వారు సర్వకాలాల్లో ప్రకాశిస్తూనే ఉంటారు.

Updated Date - Mar 07 , 2025 | 07:02 AM