Share News

పునరుత్థానానికి నిరీక్షణ

ABN , Publish Date - Apr 11 , 2025 | 04:22 AM

దైవ కుమారుడైన ఏసు క్రీస్తు మరణం, పునరుత్థానం అద్వితీయమైన ఘట్టాలు. వాటిని స్మరించుకుంటూ... దైవ చింతనకు, సేవకు పునరంకితం కావడానికి ఉద్దేశించిన రోజులు... ‘లెంట్‌ డేస్‌’ లేదా ‘శ్రమ దినాలు’..

పునరుత్థానానికి నిరీక్షణ

దైవమార్గం

దైవ కుమారుడైన ఏసు క్రీస్తు మరణం, పునరుత్థానం అద్వితీయమైన ఘట్టాలు. వాటిని స్మరించుకుంటూ... దైవ చింతనకు, సేవకు పునరంకితం కావడానికి ఉద్దేశించిన రోజులు... ‘లెంట్‌ డేస్‌’ లేదా ‘శ్రమ దినాలు’. క్రీస్తు మరణానికి ముందు ఉండే నలభై రోజులను ‘శ్రమదినాలు’ అంటారు. ఏసు క్రీస్తు తనంతట తానుగా పట్టుబడి, రోమన్‌ సైనికుల ద్వారా శిలువ శిక్షకు గురి కాకవడానికి ముందు... నలభై రోజుల పాటు ఎడారిలో ఉన్నాడు. తన తండ్రి అయిన దేవుణ్ణి ధ్యానిస్తూ ఉపవాస దీక్ష పాటించాడు. దానికి గుర్తుగా... ఆ నలభై రోజుల్లో క్రైస్తవులు ఉపవాసాలు చేస్తారు. దాన ధర్మాలు చేయడం, ఇతరుల పట్ల ద్వేష భావాన్ని తొలగించుకొని, స్నేహంతో, ప్రేమపూర్వకంగా ఉండడం లాంటి నియమాలను అనుసరిస్తారు. కాగా, రోమన్‌ క్రైస్తవులు ప్రతి శుక్రవారం ‘శిలువ మార్గం’ అనే భక్తి ధ్యాన ప్రక్రియను పాటిస్తారు. క్రీస్తు మరణ సంబంధమైన ఘట్టాలను పునశ్చరణ చేసుకుంటారు.

జనోద్ధరణ కోసం ఏసు హింసకు గురయ్యాడు, శిలువపై మరణించాడు. అది గుడ్‌ ఫ్రైడే. ఆ తరువాత మూడో రోజున తిరిగి ప్రాణాలతో లేచాడు. అదే పునరుత్థాన పండుగ... ఈస్టర్‌. ఆ రోజును గమ్యంగా చేసుకొని ఈ దీక్షలు కొనసాగుతాయి. ఏసును ధ్యానిస్తూ... గతంలో చేసిన పొరపాట్లను గుర్తు చేసుకొని, పశ్చాత్తాపం చెందడానికి, మానసికంగా పరిశుద్ధులు కావడానికి, తమలోని దోషాలను సరిదిద్దుకోవడానికి అనువైన రోజులుగా


వీటిని పరిగణిస్తారు. విలాసవంతమైన జీవన విధానానికి, విందులకు, వినోదాలకు, ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. శుభ శుక్రవారం కోసం, ఆ తదుపరి ఆదివారం వచ్చే ఈస్టర్‌ కోసం సమాయత్తమయ్యే దినాలు. క్రీస్తు పునరుత్థానానికి నిరీక్షణ దినాలు.

డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌

Updated Date - Apr 11 , 2025 | 04:22 AM