Beauty Tips: వేడి వాతావరణంలో చెక్కుచెదరకుండా
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:51 PM
ఎండ వేడి పెరుగుతోంది. కాబట్టి చలికాలం మేకప్ సాధనాలకు స్వస్థి చెప్పి, వేసవికి తగిన వాటిని ఎంచుకోవాలి. అందుకోసం...

ప్రైమర్: గాల్లోని తేమ వల్ల చర్మరంథ్రాలు అవసరానికి మించి పనిచేస్తూ స్వేదాన్నీ, చర్మపు సహజనూనె... సీబమ్‌నూ స్రవిస్తూ ఉంటాయి. దాంతో వేసవి మేక్‌పతో ముఖం జడ్డుగా మారిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే, ముఖానికి ప్రైమర్ పూసుకోవాలి. మరీ ముఖ్యంగా ముక్కు, నుదురు, చుబుకాలకు ప్రైమర్ అప్లై చేసుకోవాలి.
పౌడర్: మేకప్ చెక్కుచెదరకుండా ఉండాలంటే చివర్లో పౌడర్‌తో సెట్ చేసుకోవాలి. ఫౌండేషన్ లేదా కన్‌సీలర్ పూసుకున్న తర్వాత, ముఖం మీద ముడతలు పడే వీలున్న ప్రదేశాల్లో తప్పనిసరిగా లూజ్ పౌడర్ ఉపయోగించాలి. బేకింగ్ అనే ఈ ప్రక్రియ వల్ల బేస్ మేకప్ ముఖానికి అంటుకుపోయి, ఎక్కువ కాలం చెదిరిపోకుండా నిలుస్తుంది.
ఫౌండేషన్: వేడికి మేకప్ కరిగిపోకుండా ఉండాలంటే, తేలికపాటి ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి. ఫేస్ టింట్ కూడా వాడుకోవచ్చు. లైట్‌వెయిట్ ఆకృతి కలిగి ఉండే ఫౌండేషన్ ఎంచుకున్నా, ఫేస్ టింట్‌ను ఎంచుకున్నా వీలైనంత పరిమితంగానే వాడుకోవాలి.
మస్కారా: ఈ కాలంలో వాటర్‌ప్రూఫ్ మస్కారా వాడుకోవాలి. అలాగే కనురెప్పల కోసం సింగిల్ మెటాలిక్ ఐషాడోలనే ఎంచుకోవాలి. ఎండలో, ఉక్కపోతలో ఎక్కువ సమ యం గడపవలసిన సందర్భాల్లో కారిపోకుండా ఉండే వాటర్‌ప్రూఫ్ ఉత్పత్తులనే ఎంచుకోవాలి.
లిప్ టింట్: టింట్ వల్ల పెదవులు సహజసిద్ధ మెరుపును సంతరించుకుంటాయి. టింట్ లేకపోతే, పౌడర్ బ్లష్, లిప్ బామ్‌లను సమపాళ్లలో కలుపుకుని లిప్ టింట్‌గా వాడుకోవచ్చు. బ్లష్ లేకపోతే దానికి బదులుగా లిప్ లైనర్ లేదా క్రీమీ లిప్‌స్టిక్‌ను కూడా వాడుకోవచ్చు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: మంత్రులకు ర్యాంకులు.. టాప్.. లాస్ట్ ఎవరంటే..?
Also Read: అక్రమవలస దారులకు సంకెళ్లు.. స్పందించిన విదేశాంగ మంత్రి
Also Read: విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచడానికి వీలు లేదు
Also Read: మాదాపూర్‌లో మళ్లీ డ్రగ్స్ పట్టివేత