Share News

Gardening: బాల్కనీలో మొక్కలు కనువిందుగా...

ABN , Publish Date - Mar 05 , 2025 | 05:27 AM

కొంతమంది ఇళ్లలో బాల్కనీ చాలా చిన్నగా ఉంటుంది. అయినప్పటికీ ఉన్న స్థలంలోనే వీలైనన్ని ఎక్కువ మొక్కలను ఎలా పెంచాలో తెలుసుకుందాం.

Gardening: బాల్కనీలో మొక్కలు కనువిందుగా...

బాల్కనీలో గోడవారగా స్టాండ్లను ఒకదానిపై మరోటి ఏర్పాటు చేసి వాటి మీద చిన్న కుండీలను అమర్చి వర్టికల్‌ గార్డెన్‌ని పెంచవచ్చు. ఇది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది.

బాల్కనీలో వేలాడే కుండీలను ఏర్పాటు చేసుకున్నా అహ్లాదకరంగా అనిపిస్తుంది. బరువు తక్కువగా ఉండే కుండీలను ఎంచుకుని వాటిలో తేలికపాటి పూల మొక్కలు పెంచితే బాల్కనీ ఆకర్షణీయంగా ఉంటుంది.

బాల్కనీలో ఉన్న స్థలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ కుండీల సైజుని నిర్ణయించుకోవాలి. వంకాయ, కాకర, దొండ, బీర, టమాటా, చిక్కుడు, దోస లాంటి కూరగాయలతోపాటు పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయుర్వేద మొక్కలను సైతం కుండీల్లో సులభంగా పెంచవచ్చు.


ఇంట్లో వాడకుండా పక్కన పెట్టిన స్టూల్‌, బెంచీ, చిన్న టేబుల్‌ లాంటివాటిని బాల్కనీలో అందంగా అమర్చి వాటిపై కుండీలను పెడితే బాగుంటుంది.

చిన్న కుండీల్లో తక్కువ మట్టి ఉన్నప్పటికీ విరివిగా పెరిగే మొక్కలను ఎంచుకుంటే బాల్కనీ చిన్న తోటలా కనిపిస్తుంది.

రంగు రంగుల పూలు, ఆకు కూరలు, తీగలాగా పాకే కూరగాయల మొక్కలను పెంచితే బాల్కనీ కనువిందుగా ఉంటుంది.

Updated Date - Mar 05 , 2025 | 05:27 AM