Stress: కౌన్సెలింగ్ అందుకు ఒత్తిడి కారణమా?
ABN , Publish Date - Feb 13 , 2025 | 06:00 AM
ఇలా వారం పాటు రాస్తే ఒత్తిడికి అసలు కారణంతెలిసిపోతుంది. ఇలా రాసుకోవడం ద్వారా...ఉదయం నిద్ర లేచినప్పుడు, లేదా పడుకోబోయే ముందు, లేదా లైంగిక క్రీడకు ముందు... ఇలా ఏదో ఒక ఒత్తిడి క్రమం తెలుస్తుంది.

డాక్టర్! నాకు ఒత్తిడి ఎక్కువ. ఆయనకు శారీరకంగా దగ్గరయ్యే సమయంలో అకస్మాత్తుగా ఆసక్తి సన్నగిల్లుతోంది. ఒత్తిడి తగ్గి, అందరిలా లైంగిక తృప్తి పొందే మార్గం సూచించండి?
- ఓ సోదరి, హైదరాబాద్
ముందు మీ ఒత్తిడికి చికిత్స తీసుకోవాలి. రోజు మొత్తంలో మీరు ఏ ఏ సమయాల్లో, ఏ పనులు చేసేటప్పుడు ఒత్తిడికి గురవుతున్నారో ఒక డైరీలో రాసుకోండి. ఇలా వారం పాటు రాస్తే ఒత్తిడికి అసలు కారణంతెలిసిపోతుంది. ఇలా రాసుకోవడం ద్వారా...ఉదయం నిద్ర లేచినప్పుడు, లేదా పడుకోబోయే ముందు, లేదా లైంగిక క్రీడకు ముందు... ఇలా ఏదో ఒక ఒత్తిడి క్రమం తెలుస్తుంది. ఆ క్రమాన్ని బట్టి కారణం ఏదో కూడా అర్థమవుతుంది. అలా తెలుసుకున్న ఒత్తిడి కారకాన్ని అదుపు చేసుకుంటే, ఒత్తిడి దానంతటదే అదుపులోకొస్తుంది. ఒక్కసారి ఒత్తిడి చేతిలో ఇరుక్కుంటే మీ జీవనశైలి, లైంగిక జీవితం రెండూ ప్రభావితమై, లైంగికాసక్తి పూర్తిగా సన్నగిల్లుతుంది. కాబట్టి మీ వారితో మాట్లాడి, లైంగికంగా దగ్గరయ్యే సమయంలో ఒత్తిడిని కలిగించే అంశాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలా ఒత్తిడికి దూరంగా కాగలిగితే, ఒత్తిడి నుంచి తప్పించుకోగలిగే మెలకువలు కూడా మీకు అలవడతాయి. వాటిని అనుసరించి ఒత్తిడిని, దాని కారణంగా వస్తున్న అసంతృప్తినీ తేలికగా జయించవచ్చు. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం యోగా, ధ్యానం కూడా సాధన చేయవచ్చు.
- డాక్టర్ షర్మిలా మజుందార్,
చీఫ్ సెక్సాలజిస్ట్ అండ్ సైకో అనలిస్ట్,
హైదరాబాద్.