Share News

Kitchen Tips: పాలు పొంగకుండా ఇలా

ABN , Publish Date - Nov 29 , 2025 | 02:57 AM

పాలను వేడిచేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఒక్కోసారి అవి పొంగిపోతుంటాయి. దీంతో పాలు వృథా కావడమే కాదు స్టవ్‌, ప్లాట్‌ఫామ్‌ శుభ్రం చేయాల్సి వస్తుంది. అలాకాకుండా ఉండాలంటే.. పాలు కాచేటప్పుడు కొన్ని టిప్స్‌ పాటిస్తే సరి....

Kitchen Tips: పాలు పొంగకుండా ఇలా

పాలను వేడిచేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఒక్కోసారి అవి పొంగిపోతుంటాయి. దీంతో పాలు వృథా కావడమే కాదు స్టవ్‌, ప్లాట్‌ఫామ్‌ శుభ్రం చేయాల్సి వస్తుంది. అలాకాకుండా ఉండాలంటే.. పాలు కాచేటప్పుడు కొన్ని టిప్స్‌ పాటిస్తే సరి.

  • పాలు కాచడానికి వెడల్పాటి గిన్నె లేదా లోతు ఎక్కువగా ఉన్న గిన్నెను తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది.

  • చాలామంది గిన్నెలో పాలు పోసిన తరువాత అందులో నీళ్లు కలుపుతూ ఉంటారు. అలాకాకుండా స్టవ్‌ మీద గిన్నె పెట్టి కొన్ని నీళ్లు పోసి అవి వేడెక్కిన తరువాత అందులో పాలు పోయాలి. దీనివల్ల పాలు పొంగకుండా చక్కగా మరుగుతాయి.

  • స్టవ్‌ మీద పాల గిన్నె పెట్టిన తరువాత దాని అంచులకు కొద్దిగా వెన్న లేదా నెయ్యి రాస్తే పాల పొంగు కిందికి జారదు.

  • పాలు కాస్తున్నప్పుడు నురగ వేగంగా పైకి వస్తూ ఉంటే దాని మీద కొన్ని నీళ్లు చిలకరిస్తే సరిపోతుంది.

  • పాలను మరిగించేటప్పుడు.. గిన్నె మీద అడ్డంగా చెక్క గరిటె పెట్టినా, అందులో ఒక పెద్ద స్టీల్‌ చెంచా లేదా గరిటె పెట్టినా పాలు పొంగవు.

  • పాలు మరుగుతున్నప్పుడు పైన మందపాటి పొర ఏర్పడుతూ గిన్నె అంచుల వరకూ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక చెంచాతో పాలను కలిపితే అవి పొంగకుండా ఉంటాయి. ఈ పొర మీద ఒక చుక్క నెయ్యి వేసినా కూడా ప్రయోజనం కనిపిస్తుంది.

  • పాలు మరుగుతున్నప్పుడు అందులో చిటెకెడు వంటసోడా కలిపితే అవి పొంగవు. ఎక్కువసేపు తాజాగా ఉంటాయి కూడా.

  • పాలను కాచేటప్పుడు పెద్ద మంట కాకుండా మధ్యస్థాయి లేదా చిన్న మంట ఉండేలా చూసుకుంటే ఈ సమస్య రాదు.

Updated Date - Nov 29 , 2025 | 02:57 AM