Share News

self-confidence: ఈ జాగ్రత్తలు తీసుకోండి..

ABN , Publish Date - Mar 17 , 2025 | 04:35 AM

మనం ప్రవర్తించే తీరు ఆధారంగానే మన చుట్టూ ఉన్న వారు మనల్ని అంచనా వేస్తారు. అందుకే మనసులో భావాలు ఎక్కువగా బయటకు కనిపించనివ్వకుండా... శరీర కదలికలలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే - ఇతరులకు ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు కనిపిస్తారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆ జాగ్రత్తలేమిటో చూద్దాం..

 self-confidence: ఈ జాగ్రత్తలు తీసుకోండి..

ఎప్పుడూ వంగి కుంగిపోయినట్లు కనిపించకూడదు. వీలైనంత వరకు వెన్నెముక నిటారుగా ఉండాలి. తలపైకి ఎత్తే చూడాలి. దీని వల్ల ఇతరులకు మనం ఆత్మవిశ్వాసంతో ఉన్నామనే విషయం అర్థమవుతుంది.

మాట్లాడేటప్పుడు స్పష్టంగా అందరికీ వినిపించేలా మాట్లాడాలి. నంగినంగిగా, గుసగుసలాడుతున్నట్లు మాట్లాడకూడదు. ఇలా మాట్లాడటం వల్ల మనం చెప్పే విషయం ఇతరులకు అర్ధం కాదు.

ఇతరులతో మాట్లాడుతున్న సమయంలో లేదా ఒక సమూహంలో ఉన్న సమయంలో కాళ్లు, చేతులు వేగంగా కదల్చకూడదు. కదలికలు నెమ్మదిగా, స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. ఇదే విధంగా ఉద్దేశపూర్వకంగా చేతులతో చేసే సైగలు అనేక భావాలను సూచిస్తాయి. అందువల్ల వాటిపై కూడా నియంత్రణ ఉండాలి.

ఎక్కువ మంది ఉన్న సమయంలో చేతి గోళ్లు కొరుక్కొవటం, తల గోక్కొవటం వంటివి చేయకూడదు. ఈ తరహా కదలికలు ఇబ్బందిని కలిగిస్తాయి.

కుర్చీలో లేదా సోఫాలో పడుక్కున్నట్లు కూర్చోకూడదు. పాదాలు నేలపై నిటారుగా ఉండేలా చూసుకోవాలి.


ఇవి కూడా చదవండి..

PM Modi: భారత శాంతి సందేశం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది

MK Stalin: ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్ అప్‌డేట్

Shahi Jama Masjid: వివాదాస్పద షాహి జామా మసీదుకు పెయింటింగ్..

Viral Video: ఇది కదా పోలీసుల పవర్.. నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 17 , 2025 | 04:35 AM