Share News

Protecting Your Knees: మోకీళ్లు అరిగితే

ABN , Publish Date - Jul 17 , 2025 | 05:03 AM

కీళ్లు అరగడం మొదలైన వెంటనే, అవి మరింత అరిగిపోకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందుకోసం...

Protecting Your Knees: మోకీళ్లు అరిగితే

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! నా వయసు 60. మోకీళ్ల అరుగుదల మొదలైనట్టు వైద్యులు చెప్పారు. కీళ్లు మరింత అరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరిస్తారా?

- ఓ సోదరి, హైదరాబాద్‌.

కీళ్లు అరగడం మొదలైన వెంటనే, అవి మరింత అరిగిపోకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందుకోసం...

  • మెత్తని సోఫాల్లో కూర్చోకూడదు. సోఫాలో కూర్చున్నప్పుడు మోకాలు 90 డిగ్రీల కోణంలో ముడుచుకుంటుంది. ఈ కోణంలో, మోకాళ్ల మీద భారం మోపుతూ లేచే ప్రయత్నం చేస్తే కీళ్ల అరుగుదల పెరుగుతుంది. కాబట్టి సోఫా బదులు, వెన్నుకు ఆసరాను అందించే కుర్చీలు వాడుకోవాలి.

  • ట్రెడ్‌మిల్‌, జుంబా, ఏరోబిక్స్‌కు బదులు మెత్తని పచ్చిక మీద నడక, సైకిల్‌ తొక్కడం, క్రాస్‌ ట్రైనర్‌ మొదలైన వ్యాయామాలు చేయాలి.

  • మెత్తని బూట్లు వాడాలి.

  • నేల మీద కూర్చోకూడదు, పడుకోకూడదు.

  • బరువును అదుపులో ఉంచుకోవాలి.

  • వైద్యులు సూచించిన ఫిజియోఽథెరపీ చేయాలి.

  • వైద్యులు సూచించే సప్లిమెంట్లు వాడుకోవాలి.

  • మెట్లు ఎక్కడం తగ్గించాలి.

  • క్యాల్షియం కలిగి ఉండే ఆహారం తినాలి.

  • కండరాలను దృఢపరిచే నడకతో కీళ్ల అరుగుదల అదుపులోకొస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 20 నిమిషాల పాటు నడవాలి.

లిగమెంట్లు ఎంతో కీలకం!

కారు సాఫీగా నడవడానికి నాలుగు చక్రాలు ఎంత అవసరమో, కీళ్లు సాఫీగా కదలడానికి లిగమెంట్లు అంత అవసరం. ఎముకలను సరైన కోణంలో కదిలే ఆసరాను లిగమెంట్లు అందిస్తాయి. వీటిలో చీరికలు ఏర్పడితే ప్రమాదం జరిగిన కొద్ది రోజుల వరకూ నొప్పి వేధించి తగ్గిపోయినా, ఆ నష్టం దీర్ఘకాలంలో ఆర్థ్రయిటి్‌సకు దారి తీస్తుంది. కాబట్టి లిగమెంట్‌ గాయం కారణంగా మోకీళ్లలో సమస్యలు తలెత్తే వీల్లేకుండా వెంటనే సర్జరీతో సరి చేయించుకోవాలి.

- డాక్టర్‌ దశరధరామ రెడ్డి

ఆర్థోపెడిక్‌ సర్జన్‌, హైదరాబాద్‌.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 17 , 2025 | 05:03 AM