Share News

Home Decor: ఇల్లు అందంగా కనిపించాలంటే...

ABN , Publish Date - Mar 03 , 2025 | 01:02 AM

ఇల్లు అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. చిన్న చిట్కాలు పాటిస్తూ ఇంటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.

Home Decor: ఇల్లు అందంగా కనిపించాలంటే...

ప్రస్తుతం హాల్‌, డ్రాయింగ్‌ రూమ్‌, లివింగ్‌ రూమ్‌ గోడల మీద కళాత్మక చిత్రాలను పెయింట్‌ చేయించుకోవడాన్ని అందరూ ఇష్టపడుతున్నారు. వీటివల్ల గదికి రిచ్‌ లుక్‌ వస్తుంది. సరసమైన ధరకే రంగురంగుల చిత్రాలు అందుబాటులో ఉంటున్నాయి. చక్కని ప్రకృతి, జంతువులు, పక్షుల చిత్రాలు ఉన్న ఫొటోఫ్రేమ్‌లను అక్కడక్కడ ఏర్పాటు చేసినా ఇల్లు కళగా కనిపిస్తుంది.

వ్యక్తిగత ఫొటోలతో గోడలను నింపేయకూడదు. ఇంట్లో ఒక గోడను ఎంపిక చేసుకుని అక్కడ మాత్రమే కుటుంబ సభ్యుల ఫొటోలు పెడితే బాగుంటుంది.

హాల్‌లో కిటికీలకు కాంట్రాస్ట్‌ కలర్‌ కర్టెన్లు వేస్తే క్లాసీ లుక్‌ వస్తుంది. కట్టుకోని చీరలు ఉంటే వాటితో కూడా అందమైన కర్టెన్లు రూపొందించవచ్చు. ఫ్లోరల్‌ ప్రింట్స్‌ ఉన్న చీరలు అయితే ఆకర్షణీయంగా కనిపిస్తాయి.


గది మూలల్లో మొక్కల కుండీలు పెడితే చూడడానికి బాగుంటుంది. కృత్రిమ మొక్కలు, తీగలు, పువ్వులతో కూడా ఇంటిని అలంకరించుకోవచ్చు.

ఇంట్లో సోఫా లేని పక్షంలో నేలపై మందపాటి పరుపు వేసి అందమైన కుషన్‌లు అమరిస్తే హాల్‌ ప్రత్యేకంగా కనిపిస్తుంది.

డ్రాయింగ్‌ రూమ్‌, డైనింగ్‌ రూమ్‌లలో దీర్ఘచతురస్రాకారపు కార్పెట్‌ వేస్తే ఇంటికి గ్రాండ్‌ లుక్‌ వస్తుంది.

హాల్‌లో ఉండే సింక్‌కు జతగా అద్దం, హ్యాండ్‌వాష్‌, చిన్న టవల్‌ లాంటివి పెట్టుకుంటే ఇంటికి డీసెంట్‌ లుక్‌ వస్తుంది.



Read Also : Elon Musk : 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్.. ఇంత మంది ఎందుకంటే.. సమాధానమిదే..

Carrots : పచ్చి క్యారెట్లు vs వండిన క్యారెట్లు.. ఎలా తింటే ఎక్కువ మేలు..

Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలో రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా

Updated Date - Mar 03 , 2025 | 01:02 AM