Share News

chili spice levels: కారం గుట్టు తెలిసింది

ABN , Publish Date - May 29 , 2025 | 06:09 AM

మిరపకాయల్లో ఉండే క్యాప్సైసినోయిడ్స్ వలన కారం తెలుస్తుంది. కానీ క్యాప్సైనోసైడ్‌ ఐ, రోసియోసైడ్‌, జింజర్‌గ్లికోలిపిడ్‌-ఎ లాంటి చక్కెరల సమ్మేళనాలు ఎక్కువగా ఉంటే మిరపకాయలు తక్కువ ఘాటుగా ఉంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

chili spice levels: కారం గుట్టు తెలిసింది

కొన్ని మిరపకాయలు తక్కువ కారంగా ఉంటాయి. మరికొన్ని చాలా ఎక్కువ కారంగా ఉంటాయి. అయితే ఇలా ఉండడానికి కారణమేంటన్నది శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం...

మిరపకాయల్లో ఉండే క్యాప్సైసినోయిడ్స్‌ సమ్మేళనాల (క్యాప్సైసిన్‌, డిహైడ్రోక్యాప్సైసిన్‌) వలన కారం ఘాటు వ ునకు తెలుస్తుంది. శాస్త్రవేత్తలు పలు రకాల మిరప పొడులను, మరికొన్నింటిని టమాట రసంలో కలిపి టేస్టర్‌లతో పరిశీలించారు. అవి కాక ఇంకా మరికొన్ని రసాయన విశ్లేషణలు కూడా చేశారు. చివరికి క్యాప్సైనోసైడ్‌ ఐ, రోసియోసైడ్‌, జింజర్‌గ్లికోలిపిడ్‌ ఎ అనే సమ్మేళనాలు ఎక్కువ మొత్తంలో ఉన్న మిరపకాయల్లో ఘాటు తక్కువగా ఉందని గుర్తించారు. ఈ మూడు సమ్మేళనాల్లో గ్లూకోజ్‌, చక్కెర ఉంటాయి. అందుకే ఇవి ఎక్కువగా ఉన్న మిరపకాయలు తక్కువ కారం కలిగి ఉంటాయి.


Also Read:

మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు

బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్

For More Telugu And National News

Updated Date - May 30 , 2025 | 02:55 PM