Vitamin D: విటమిన్ డి లేదా చేప నూనె.. ఏదిమేలు
ABN , Publish Date - May 27 , 2025 | 04:32 AM
విటమిన్ డి శరీరానికి కాల్షియం అందజేసి ఎముకలు బలపరచడమే కాక మానసిక ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. చేపనూనెలో ఉండే ఓమేగా-3 మరియు విటమిన్ ఎ గుండె, మెదడు, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి, అయితే ఇవి అవసరమైనపుడు మాత్రమే వైద్యుల సలహాతో తీసుకోవాలి.
విటమిన్ డి, చేప నూనె రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే, ఒకే విధమైన ప్రయోజనాన్ని అందించేవే! అయితే వీటిలో దేన్ని ఎంకుకోవాలి? తెలుసుకుందాం!
విటమిన్ డి మేలు : విటమిన్ డి ఎముల ఆరోగ్యానికీ, వ్యాధినిరోధకతకూ సహయాపడుతుంది. అలాగే మానసిక ఆరోగ్య మెరుగుదలలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. శరీర వాపులను తగ్గిస్తుంది. శరీరానికి అవసరమైన కాల్షియం అందించడంలో సహాయపడుతుంది. అమెరికాలో 35 శాతం మంది పెద్దలు(ముఖ్యంగా శీతాకాలంలో) విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ డి లోపం వలన ఎముకలు బలహీనపడడంతో పాటు డిప్రెషన్ ఆవహిస్తుంది. సాధారణంగా విటమిన్ డి, సూర్యరశ్మి నుంచి అందుతుందని మనకు తెలుసు. పాలు, చీజ్, గుడ్డు సొన, చేప కొవ్వుల నుంచి కూడా విటమిన్ డి అందుతుంది. అయితే సూర్యరశ్మి సరిగ్గా అందనివారు, డి విటమిన్ లోపంతో బాధపడేవారు విటమిన్ డి సప్లిమెంట్స్ వాడుకోవలసిన అవసరం ఉంటుంది. అయితే ఈ విటమిన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల అనర్థాలు కూడా ఉన్నాయి. అధిక మోతాదు విటమిన్ డి శరీరంపై విషంలా పనిచేస్తుంది. హైపర్ కాల్సీమియా(అధిక కాల్షియం), వికారం, మూత్రపిండాల సమస్యలకు దారి తీస్తుంది.
చేప నూనె మంచిదే! : ఇది గుండె , మెదడు ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. చేపనూనె మెదడును చురుగ్గా ఉండడతో పాటు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. చేపనూనెలో ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే దీన్లో విటమిన్ ఎ కూడా అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మ ఆరోగ్యానికి దోహదపడుతుంది. అమెరికా హార్ట్ అసోసియేషన్, వారినికి రెండు సార్లు చేపలు(వీలైతే కొవ్విన చేపలు) తినాలని సిఫార్సు చేస్తోంది. తరచూ చేపలను తినలేని వారు దానికి ప్రత్యమ్నాయంగా చేపనూనె సప్లిమెంట్లను తీసుకుంటారు. అయితే ఈ సప్లిమెంట్ల వలన జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి.
విటమిన్ డి క్యాప్సూల్, చేపనూనె సప్లిమెంట్లు... ఈ రెండూ ఆరోగ్యానికి లాభం చేకూర్చేవే! కానీ వీలైనంత వరకూ విటమిన్లు, పోషకాలు మన శరీరానికి సహజసిద్ధంగా అందేలా చూసుకోవాలి. ఆ తర్వాత మనకున్న సమస్యను బట్టి వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు వీటిలో ఏది మన శరీరానికి అవసరమో దాన్ని సప్లిమెంట్ రూపంలో తీసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి
ఆ పోటీలకు కోట్లల్లో ఖర్చు.. మరి రైతులకు.. హరీష్ సూటి ప్రశ్న
బీజేపీని టార్గెట్ చేసిన కేటీఆర్.. వీడియోలతో సెటైర్లు
Read Latest Telangana News And Telugu News