Monsoon Makeup Tips: తడికి చెదరకుండా..
ABN , Publish Date - Aug 09 , 2025 | 02:33 AM
వానాకాలం ఎన్ని జాగ్రత్తలు పాటించినా, అడపాదడపా తడుస్తూనే ఉంటాం. ఇలా తడిచిన ప్రతిసారీ మేకప్
వానాకాలం ఎన్ని జాగ్రత్తలు పాటించినా, అడపాదడపా తడుస్తూనే ఉంటాం. ఇలా తడిచిన ప్రతిసారీ మేకప్ సరిచేసుకోవడం అన్నిసార్లూ వీలుపడదు. కాబట్టి ఈ కాలానికి తగిన మేకప్ ఎంచుకోవాలి.
పరిశుభ్రం: మేక్‌పకు తగ్గట్టు ముఖ చర్మం శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖం మీద తేమ, జిడ్డులను తొలగించుకుని ఆ తర్వాతే మేకప్ మొదలుపెట్టుకోవాలి.
మాయిశ్చరైజర్: పగటివేళ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ మాత్రమే ఉపయోగించాలి. ముఖం జిడ్డుగా మారకుండా ఉండడానికి ఇది తోడ్పడుతుంది.
సన్ ప్రొటెక్షన్: వానాకాలం కదా అని సన్‌స్ర్కీన్ మానుకోకూడదు. ఈ కాలంలో కూడా 30 కంటే ఎక్కువ ఎస్‌పిఎఫ్ ఉన్న సన్‌స్ర్కీన్ వాడుకోవాలి. మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత సన్‌స్ర్కీన్, ఆ తర్వాత ఫౌండేషన్ సరైన ఛాయిస్.
ప్రైమర్: మేకప్ వన్నె తగ్గకుండా ఉండాలంటే ప్రైమర్ కూడా తప్పనిసరిగా వాడాలి. ముడతలను కనపడనివ్వకుండా చేసే ప్రైమర్‌తో యంగర్ లుక్ వస్తుంది.
తక్కువ మేకప్: ముఖం మీద మేకప్ ముద్దలు కట్టకుండా, గీతలు పడకుండా ఉండాలంటే, వీలైనంత తక్కువ మేకప్ వేసుకోవాలి. తప్పనిసరి అయితే టింటెడ్ మాయిశ్చరైజర్, కన్‌సీలర్లను ఉపయోగించుకోవచ్చు.
బ్రాంజర్: కళ్లు ఆకర్షణీయంగా కనిపించాలంటే బ్రాంజర్ వాడుకోవాలి. తాజాగా, సహజసిద్ధ సౌందర్యంతో మెరిసిపోవాలంటే నుదురు, చీక్ బోన్స్, చుబుకం, ముక్కు మీద బ్రాంజర్ అప్లై చేయాలి. ఈ కాలంలో క్రీమ్ రూపంలోని బ్రాంజర్లనే ఎంచుకోవాలి.
షిమ్మర్ వద్దు: అవసరానికి మించిన మెరుపులు ఈ కాలంలో ఎబ్బెట్టుగా ఉంటాయి. కాబట్టి ఈ కాలంలో షిమ్మర్‌ను వాడకపోవడమే మంచిది.
బ్లష్: ఈ కాలంలో పౌడర్ బ్లష్‌లకు బదులుగా జెల్ బ్లష్ వాడుకోవాలి.
లిప్‌స్టిక్: ముదురు రంగు లిప్‌స్టిక్‌లకు బదులుగా హాయిగొలిపే లేత గులాబీ, లేత నారింజ రంగులను ఎంచుకోవాలి.