microplastics: మైక్రోప్లాస్టిక్స్ ఇలా మాయం
ABN , Publish Date - May 27 , 2025 | 04:39 AM
నీటిలోని మైక్రోప్లాస్టిక్స్‌ను తొలగించేందుకు బెండకాయ, మెంతి పొడులు సహజ పరిష్కారంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఒక్క లీటరు నీటిలో ఒక గ్రాము ఈ పొడులను కలిపితే 67% మైక్రోప్లాస్టిక్స్ తొలగిపోతాయని ప్రయోగాలు చూపిస్తున్నాయి.
శరీరంలోకి చేరుకునే మైక్రోప్లాస్టిక్స్ ఆరోగ్యానికి ఎంత హానికరమో మనందరికీ తెలిసిందే! ఇవి నీళ్ల ద్వారా మన శరీరంలోకి చేరుకుంటూ ఉంటాయి. కాబట్టి బెండకాయ, మెంతులతో వాటిని నిర్మూలించే ఒక చిన్న చిట్కాను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అదేంటంటే...
నీటి శుద్ధి ప్రక్రియలో మెంతులు, బెండకాయ పొడులను కలపడం ద్వారా నీళ్లలో కలిసిన మైక్రోప్లాస్టిక్స్‌తో పాటు ఇతరత్రా కలుషితాలను నిర్మూలించవచ్చని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అందుకోసం ఒక లీటరునీళ్లలో ఒక గ్రాము బెండకాయ, మెంతి పొడిని కలపడం ద్వారా గంట సమయంలో 67ు మైక్రోప్లాస్టిక్స్ తొలగిపోయినట్టు వాళ్లు ప్రయోగాలతో కనిపెట్టారు. సమపాళ్లలో కలిపిన బెండ, మెంతి పొడులు సహజసిద్ధ పాలిమర్స్‌లా ప్రవర్తిస్తూ, సింథటిక్, వాణిజ్యపరమైన పాలిమర్స్ కంటే ఎంతో సమర్థంగా వ్యర్థనీటి శుద్ధికి తోడ్పడుతున్నట్టు వాళ్లు తెలుసుకున్నారు. ఈ తాజా ప్రయోగంతో నీటిశుద్ధి ప్రక్రియ మరింత మెరుగుపడి, నీటిలో కలిసిన మైక్రోప్లాస్టిక్స్, కలుషితాలు తొలగిపోయి, వాటితో ముడిపడి ఉండే అనారోగ్యాల ముప్పు తప్పుతుందని వాళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆ పోటీలకు కోట్లల్లో ఖర్చు.. మరి రైతులకు.. హరీష్ సూటి ప్రశ్న
బీజేపీని టార్గెట్ చేసిన కేటీఆర్.. వీడియోలతో సెటైర్లు
Read Latest Telangana News And Telugu News