Share News

Nail Infection Remedies: కాలి గోళ్లను ఇలా కాపాడుకోవాలి...

ABN , Publish Date - May 29 , 2025 | 06:11 AM

పరిశుభ్రత లేకపోవడం వల్ల కాలి గోళ్లలో ఫంగస్ ఏర్పడి నలుపు, నొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. వెనిగర్‌, వెల్లుల్లి, బేకింగ్‌ సోడా, నిమ్మరసం, పసుపు వంటి సహజ పదార్థాలతో ఈ సమస్యను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Nail Infection Remedies: కాలి గోళ్లను ఇలా కాపాడుకోవాలి...

పరిశుభ్రత పాటించకపోవడం వల్ల కాలి గోళ్లలో ఫంగస్‌ చేరుతుంది. దీంతో గోళ్ల మీద నలుపు, పసుపు రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి. ఒక్కోసారి గోళ్ల చివర్లలో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. తరచూ బొటనవేళ్ల గోళ్లకు ఇలా జరుగుతుంది. ఈ సమస్యలన్నింటినీ పోగొట్టుకోవడానికి నిపుణులు సూచిస్తున్న చిట్కాలు ఇవే...

ఒక వెడల్పాటి టబ్‌లో బకెట్‌ వేడి నీళ్లు పోసి అందులో అర కప్పు యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ లేదా వైట్‌ వెనిగర్‌ వేసి కలపాలి. ఈ నీళ్లలో పాదాలు ఉంచాలి. అరగంట తరవాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే కాలి గోళ్లు మామూలు స్థితికి వస్తాయి.

రెండు వెల్లులి రెబ్బలను పొట్టు తీసి బాగా దంచి ఈ మిశ్రమాన్ని ఫంగస్‌ సోకిన గోళ్ల మీద పూతలా రాయాలి. వెల్లుల్లిలో ఉండే అలిసిన్‌ అనే యాంటీ ఫంగల్‌ ఏజెంట్‌ ప్రభావవంతంగా పనిచేసి ఫంగ్‌సను నిరోధిస్తుంది.

ఒక గిన్నెలో ఒక చెంచా బేకింగ్‌ సోడా వేసి రెండు చెంచాల నీళ్లు పోసి పేస్టులా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాలి గోళ్ల మీద రాయాలి. ఇరవై నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో పాదాలు కడిగేసుకుంటే గోళ్ల నొప్పి తగ్గుతుంది.

ఫంగస్‌ చేరి నల్లగా మారిన గోళ్ల మీద కొద్దిగా నిమ్మరసం లేదా టీట్రీ ఆయిల్‌ లేదా కొబ్బరినూనె చుక్కలు వేసి పావుగంటసేపు ఉంచాలి. తరవాత వేడినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తూ ఉంటే వారం రోజుల్లో గోళ్లు ఆరోగ్యంగా తయారవుతాయి.

వెడల్పాడి గిన్నె నిండుగా వేడినీళ్లు తీసుకుని అందులో రెండు చెంచాల ఉప్పు, ఒక చెంచా పసుపు వేసి బాగా కలపాలి. ఈ నీళ్లలో పాదాలు ఉంచి అరగంట తరవాత మంచినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే కాలి గోళ్లు పూర్తిగా శుభ్రపడతాయి. ఎటువంటి

సమస్యలూ రావు.


Also Read:

మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు

బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్

For More Telugu And National News

Updated Date - May 30 , 2025 | 02:57 PM