Medicinal Uses of Akshara Dara: ఔషధ అక్షర దార
ABN , Publish Date - Jul 28 , 2025 | 03:50 AM
ప్రకృతిలో మనకు ఉపయోగపడేవి ఎన్నో ఉంటాయి. కానీ వాటి గురించి మనకు పెద్దగా తెలియదు. అలాంటి ఒక మొక్క ‘అక్షర దార’. ఇది పలు అనారోగ్యలకు ఔషధంగానే కాక మరెన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఆ మొక్క గురించి...
ప్రకృతిలో మనకు ఉపయోగపడేవి ఎన్నో ఉంటాయి. కానీ వాటి గురించి మనకు పెద్దగా తెలియదు. అలాంటి ఒక మొక్క ‘అక్షర దార’. ఇది పలు అనారోగ్యలకు ఔషధంగానే కాక మరెన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఆ మొక్క గురించి తెలుసుకుందాం..
నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ‘అక్షర దార’ మొక్క మనగలుగుతుంది. ఈ మొక్కకు ‘స్ట్రెబ్లస్ ఆస్పర్’ అని శాస్త్రీయ నామం ఉంది. ఈ మొక్కను శాండ్ పేపర్ ట్రీ అని కూడా అంటారు. ఇది భారతదేశంతో పాటు శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం, మలేషియా, కంబోడియా, ఫిలిప్పీన్స్.. పలు దేశాల్లో పెరుగుతుంది. ఈ మొక్క దట్టంగా 4-15 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు అండాకారంలో ఉంటాయి. ఈ మొక్క పువ్వుల నుంచి అండాకారం కాయలు కాస్తాయి. అవి పండిన తరువాత పసుపు రంగులోకి మారతాయి. ఈ మొక్క ఆకులను, బెరడును సంప్రదాయ వైద్యంలో వినియోగిస్తారు. పంటి నొప్పి, విరేచనాలు, పాముకాటు.. మొదలైన వాటికి విరుగుడుగా కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్కలో యాంటీ ఫంగల్, యాంకీ బ్యాక్టీరియల్ వంటి ఇరవైకి పైగా బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఆ మొక్క బెరడు క్రిమిసంహారకంగా ఉపయోగపడుతుంది. అలాగే ‘అక్షర దార’తో చీజ్ తయారీ కోసం పాలను గడ్డకట్టించే ప్రోటీజ్ ఉంటుంది. దీని ఆకులను పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీని వలన పాల దిగుబడి పెరుగుతుంది. అలాగే ఈ ఆకులు జంతువులలో రుమెన్ కిణ్వ ప్రక్రియను ప్రోత్సహిస్తాయి.
డాక్టర్ శ్రీనాథ్,
వృక్ష శాస్త్రవేత్త, కన్హా శాంతివనం, హైదరాబాద్
ఇవి కూడా చదవండి
మామ, అల్లుడి గొడవ.. ఆపడానికి వెళ్లిన కానిస్టేబుల్‌పై దారుణం..
ఈ ఒక్క జ్యూస్‌తో గుండె జబ్బులన్నీ మాయం..