Share News

Color Dots Meaning: రంగు చుక్కల అర్థం

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:01 AM

బజారులో దొరికే ఆహారపు ఉత్పత్తుల ప్యాకెట్ల మీద రంగు రంగుల చుక్కలు ముద్రించి ఉండడం చూస్తూ ఉంటాం.

Color Dots Meaning: రంగు చుక్కల అర్థం

జారులో దొరికే ఆహారపు ఉత్పత్తుల ప్యాకెట్ల మీద రంగు రంగుల చుక్కలు ముద్రించి ఉండడం చూస్తూ ఉంటాం. ఒక్కో రంగు ఒక్కో అంశాన్ని తెలియజేస్తుంది. ఆ వివరాలు...

  • ఆహార ప్యాకెట్లపై ఎరుపు రంగు చుక్క ఉంటే ఆ ఉత్పత్తుల్లో మాంసాహారాన్ని వినియోగించారని అర్థం. చికెన్‌, మటన్‌, చేప లాంటి మాంసాహారాలతో తయారు చేసినవిగా గుర్తించాలి.

  • ఆహారపు ఉత్పత్తుల ప్యాకెట్ల మీద ఆకుపచ్చని చుక్క ఉంటే వాటిని శాఖాహారంతో తయారుచేశారని తెలుసుకోవాలి. వీటి తయారీలో గుడ్డు, మాంసం వినియోగించలేదని అర్థం.

  • ప్యాకెట్లపై నీలి రంగు చుక్క ఉంటే అవి వైద్య పరమైన ఉత్పత్తులని అర్థం. నిర్ధిష్టమైన వ్యాధి నివారణకు వైద్యుల సలహా మేరకు మాత్రమే వాటిని వినియోగించాలి.

  • అదే పసుపు రంగు చుక్క ఉంటే ఆ ఉత్పత్తుల్లో గుడ్లు వాడారని తెలుసుకోవచ్చు.

  • ప్యాకెట్ల మీద నలుపు రంగు చుక్క ఉంటే ఆ ఉత్పత్తులను రసాయనిక పదార్థాలతో ప్రాసెస్‌ చేసి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా తయారుచేశారని అర్థం. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం ప్రభావితమవుతుందని తెలుసుకోవాలి.

Updated Date - Aug 06 , 2025 | 01:01 AM