Share News

Festive Makeup: వేడుకల్లో వెలిగేలా

ABN , Publish Date - May 03 , 2025 | 06:26 AM

వేడుకల్లో ఆకర్షణీయంగా కనిపించాలంటే చర్మ రక్షణతో పాటు సరిగ్గా ఎంచుకున్న మేకప్‌ స్టైల్‌ అవసరం. రెండు రకాల ఫౌండేషన్‌, న్యాచురల్‌ బ్లష్‌, పేస్టెల్‌ ఐషాడో, షేడ్స్‌కు తగ్గ లిప్‌స్టిక్‌లు ఉపయోగించాలి

Festive Makeup: వేడుకల్లో వెలిగేలా

మేకప్‌

పెళ్లిళ్ల సీజన్‌లోకి అడుగు పెట్టేశాం! మరి వేడుకల్లో వెలిగిపోవాలంటే అందుకోసం వేసుకునే మేకప్‌ కూడా వినూత్నంగా ఉండాలి. అదెలాగో తెలుసుకుందాం!

సన్‌స్ర్కీన్‌ అవసరమే

మేకప్‌ ముందు మాయిశ్చరైజర్‌, సన్‌స్ర్కీన్‌లను తప్పనిసరిగా పూసుకోవాలి. వీటితో వేడుకల్లో లైట్ల వెలుగుకు చర్మం పాడవకుండా ఉంటుంది. మేకప్‌ కూడా ఎక్కువ సమయం పాటు తాజాగా ఉంటుంది.

రెండు ఫౌండేషన్లు

కెమెరా ఫ్లాష్‌ వెలుగుకు ముఖం మితిమీరి వెలిగిపోకుండా ఉండాలంటే, రెండు భిన్నమైన ఫౌండేషన్లు వేసుకోవాలి. ఇందుకోసం మ్యాట్‌, సాఫ్ట్‌ గ్లోయీ రకాలకు చెందిన ఫౌండేషన్లను కలిపి వేసుకోవాలి. జిడ్డు చర్మమైతే, నుదురు, ముక్కు, చుబుకం మీద మ్యాట్‌ ఫౌండేషన్‌, మిగతా ముఖమంతా డ్యూయీ ఫౌండేషన్‌ వేసుకోవాలి. తర్వాత లూజ్‌ పౌడర్‌ అద్దుకోవాలి.

బ్లష్‌ ముఖ్యం

పగటి వేళ వేడుకలకు హాజరయ్యేటప్పుడు ముదురు రంగు బ్లష్‌లకు బదులుగా... సహజసిద్ధంగా కనిపించే న్యాచురల్‌ లేదా రోజీ బ్లష్‌ ఎంచుకోవాలి. బుగ్గలతో పాటు, కొద్దిగా ముక్కు, చుబుకం మీద కూడా లైట్‌గా బ్లష్‌ను అద్దుకోవాలి.


ఐ షాడో ఇలా...

ముఖం మొత్తంలో కళ్లూ, పెదవులే ఫోకల్‌ పాయింట్లు. కాబట్టి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. పగలైనా, రాత్రైనా ముదురు రంగు షాడోలకు దూరంగా ఉండాలి. పేస్టెల్‌, సాఫ్ట్‌ మెటాలిక్‌ ఐ షాడోలు ఎంచుకోవాలి. ముడతలు పడకుండా ఉండేందుకు క్రీమీ షాడోలకు బదులు పౌడర్‌ ఐ షాడో ఎంచుకోవాలి. పౌడర్‌ ఐ షాడోలు మేకప్‌లో చక్కగా కలిసిపోయి, ఎక్కువసేపు ఉంటాయి.

లవ్లీ లిప్‌స్టిక్‌

ఎరుపు, ప్లమ్‌, మెరూన్‌ రంగు లిప్‌స్టిక్స్‌ వేడుకలకు బాగుంటాయి. అలాగే ఐ షాడోకు మ్యాచ్‌అయ్యే లిప్‌స్టిక్‌ ఎంచుకోవాలి. గ్లిట్టర్‌, పేస్టెల్‌, మోనోటోన్‌ రంగు లిప్‌స్టిక్స్‌ పగటిపూట, మెటాలిక్‌, ముదురు రంగు షేడ్స్‌ రాత్రి వేడుకలకు మ్యాచ్‌ అవుతాయి.

Updated Date - May 03 , 2025 | 06:27 AM