Share News

One Piece Dresses: వన్‌ పీస్‌ డ్రెస్‌లతో వయ్యారంగా..

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:02 AM

ఈ డ్రెస్‌ మొత్తాన్ని ఒకే ఫ్యాబ్రిక్‌తో రూపొందిస్తారు. ఇది చూడడానికి ఫ్రాక్‌ మాదిరి కనిపిస్తుంది. పై భాగం అంటే టాప్‌

One Piece Dresses: వన్‌ పీస్‌ డ్రెస్‌లతో వయ్యారంగా..

ఈ డ్రెస్‌ మొత్తాన్ని ఒకే ఫ్యాబ్రిక్‌తో రూపొందిస్తారు. ఇది చూడడానికి ఫ్రాక్‌ మాదిరి కనిపిస్తుంది. పై భాగం అంటే టాప్‌ సన్నగా, కింది భాగం అంటే స్కర్ట్‌ వెడల్పుగా ఉంటుంది. టాప్‌ భాగానికి పొట్టి లేదా పొడవు చేతులు పెడుతుంటారు. దీనికి అందమైన నెక్‌ డిజైన్లు జోడిస్తారు. స్కర్ట్‌ భాగం.. మోకాళ్లు లేదా పాదాల వరకు పొడవుండే డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. అంబరిల్లా కట్‌, ఫ్రిల్స్‌ టైప్‌, మ్యాక్సీ, ఫ్లేర్డ్‌ మోడల్‌ డ్రెస్‌లను యువతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇవి ధరించడానికి సౌకర్యవంతంగా ఉండడంతోపాటు శరీరాకృతికి తగ్గట్టు ఇమిడిపోతాయి.

ఎలాంటి ఫ్యాబ్రిక్‌తోనైనా ఈ ‘వన్‌ పీస్‌ డ్రెస్‌’లను చక్కగా డిజైన్‌ చేయవచ్చు. ఫ్లోరల్‌ ప్రింట్లు, చెక్స్‌ ఉన్న కాటన్‌, లినెన్‌ డ్రెస్‌లు.. కార్యాలయాలు, కాలేజీలకు వెళ్లేటప్పుడు ధరించడానికి అనువుగా ఉంటాయి. వీటిని ప్రయాణాలప్పుడు వేసుకున్నా హాయిగా అనిపిస్తుంది. జార్జెట్‌, షిఫాన్‌, సిల్క్‌, నెట్టెడ్‌ ఫ్యాబ్రిక్‌లతో రూపొందించిన డ్రెస్‌లు గ్రాండ్‌గా కనిపిస్తాయి. వీటికి కుందన్‌, జర్దోసి, ఎంబ్రాయిడరీ వర్క్‌లను జోడించి మరింత ప్రత్యేకంగా అందుబాటులోకి తెస్తున్నారు. ఇవి పుట్టినరోజు, పెళ్లిరోజు లాంటి సందర్భాల్లో; ఫంక్షన్లలో వేసుకోవడానికి బాగుంటాయి. ఇలా వన్‌ పీస్‌ డ్రెస్‌ ధరించినప్పుడు లైట్‌ మేకప్‌, సింపుల్‌ హెయిర్‌ స్టయిల్‌, మెడలో డాలర్‌ చెయిన్‌, చెవులకు పెద్ద జుంకాలు లేదా చాంద్‌బాలీలు, చేతికి వాచ్‌ లేదా బ్రాస్‌లెట్‌, మధ్య వేలికి పెద్ద రింగ్‌, పాదాలకు అందమైన శాండల్స్‌ వేసుకుంటే చాలు.. ఆకర్షణీయంగా కనిపిస్తారు.

Updated Date - Aug 06 , 2025 | 01:02 AM