Share News

Parenting Awareness: పిల్లలు ఆలస్యంగా పడుకుంటున్నారా..

ABN , Publish Date - Aug 16 , 2025 | 01:20 AM

పిల్లలు నిద్రకు ఉపక్రమించే సమయం, ఎన్ని గంటలు పడుకుంటున్నారనే అంశాలు వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి...

Parenting Awareness: పిల్లలు ఆలస్యంగా పడుకుంటున్నారా..

పిల్లలు నిద్రకు ఉపక్రమించే సమయం, ఎన్ని గంటలు పడుకుంటున్నారనే అంశాలు వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు పోషకాహారంతోపాటు సరైన నిద్ర కూడా అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు సమయానికి నిద్రపోవడం వల్ల కలిగే లాభాలు, ఆలస్యంగా పడుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం...

సమయానికి నిద్రిస్తే...

  • పిల్లలు రోజూ సరైన సమయానికి నిద్రించడం వల్ల శారీరకంగా వారి ఎదుగుదల బాగుంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నేర్చుకొనే సామర్థ్యం పెరుగుతుంది. హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. తరచుగా ఒత్తిడికి గురికాకుండా భావోద్వేగాల పరంగా నియంత్రణలో ఉంటారు. ఆకలి పెరిగి చక్కగా ఆహారం తినగలుగుతారు. దీనివల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఎటువంటి వ్యాధులు రాకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.

ఆలస్యమైతే...

  • నిద్ర సరిపోక కళ్లు, మెదడు అలసిపోతాయి. దీంతో పిల్లలు రోజంతా చిరాకుగా ప్రవర్తిస్తుంటారు. జీర్ణ సమస్యలు, ఆకలి లేకపోవడం, మలబద్దకం లాంటివి ఎదురవుతాయి. కొంచెం పెద్ద పిల్లలకయితే ఏకాగ్రత కుదరదు. చదివిన అంశాలు గుర్తుండవు. ్ఝపరీక్షలు సరిగా రాయలేక నిరాశ, ఆందోళనలకు గురవుతూ ఉంటారు. పిల్లలు ఆలస్యంగా పడుకుని, ఆలస్యంగా నిద్రలేస్తుంటే తల్లిదండ్రులు గమనించి ఆ అలవాటును మానిపించాలి.

ఏ సమయానికి పడుకోవాలంటే...

  • చిన్న పిల్లలు రాత్రి ఎనిమిదింటికల్లా పడుకోవడం మంచిది. బడికి వెళ్లే పిల్లలు రాత్రి తొమ్మిది లోపు పడుకోవాలి. కనీసం ఎనిమిది నుంచి పది గంటలపాటు నిద్రించడం వారి ఆరోగ్యానికి మంచిది.

Updated Date - Aug 16 , 2025 | 01:20 AM