Share News

Children Health: పిల్లలకు అదనపు పోషకాలు అవసరమా

ABN , Publish Date - May 27 , 2025 | 04:29 AM

పిల్లలు సమతుల్య ఆహారం ద్వారా అవసరమైన పోషకాలు పొందితే సప్లిమెంట్ల అవసరం ఉండదు. అయితే వైద్యుల సూచనలతో మాత్రమే సప్లిమెంట్లు ఇవ్వాలి, అధిక మోతాదులో ఇవి హానికరమవుతాయి.

Children Health: పిల్లలకు అదనపు పోషకాలు అవసరమా

పిల్లలకు సరిపడా పోషకాలు అందాలంటే బహుళ విటమిన్‌ మాత్రలు వాడడం అవసరమని కొన్ని కంపెనీలు ప్రకటనలతో ఉదరకొడుతూ ఉంటాయి. అయితే ఆ మాత్రలు పిల్లలకు అవసరమా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

విటమిన్‌ ఎ, బి- కాంప్లెక్స్‌, సి, డి, ఇ, కె, ఐరన్‌, జింక్‌, అయోడిన్‌, క్యాల్షియం మాత్రలు, గమ్మీలు, ద్రావణాల రూపంలో అందుబాటులో ఉంటాయి. సాధారణంగా వీటిని పోషకాల లోపం ఉంటేనే వాడతారు. అయితే ఇటీవల చాలా బ్రాండ్లు తమ మల్టీవిటమిన్‌ సప్లిమెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయనీ, మెదడును చురుగ్గా ఉంచుతాయనీ, పిల్లలకు శక్తినిస్తాయనీ ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే పిల్లలకు ఇలాంటి సప్లిమెంట్లకు బదులుగా, ఆహారం ద్వారానే సరిపడా పోషకాలు అందేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు.. వాటి ద్వారా శరీరం పోషకాలను బాగా గ్రహించుకోలదని సలహా ఇస్తున్నారు. అయితే సమతుల్య ఆహారం తినని పిల్లలు, శాకాహార పిల్లలు, దీర్ఘకాలిక రుగ్మతలు, అనారోగ్య సమస్యలు, జీర్ణకోశ వాఽ్యధుల బారిన పిల్లల్లో కొన్ని పోషకాల లోపం ఉండొచ్చు. అలాంటి వారికి వైద్యుల సలహా మేరకు అవసరమైన విటమిన్‌ సప్లిమెంట్లను అందించాలి. మల్టీవిటమిన్‌ సప్లిమెంట్లు శరీరానికి పోషకాలను అందిస్తాయి. అయితే వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా పిల్లల్లో అధిక పోషకాలు మరింత హాని చేస్తాయి. కొవ్వులో కరిగే ఎ, డి, ఇ, కె విటమిన్లు శరీరంలో పేరుకుపోయి విషంగా మారతాయి. దీనివల్ల వికారం, తలనొప్పి, అలసటతో పాటు కొన్నిసార్లు అవయవాలు కూడా దెబ్బతింటాయి.


ఈ వార్తలు కూడా చదవండి

ఆ పోటీలకు కోట్లల్లో ఖర్చు.. మరి రైతులకు.. హరీష్ సూటి ప్రశ్న

బీజేపీని టార్గెట్ చేసిన కేటీఆర్.. వీడియోలతో సెటైర్లు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 27 , 2025 | 04:29 AM