Share News

Health Benefits: మునగాకు మహిమ

ABN , Publish Date - Feb 04 , 2025 | 04:06 AM

మునగాకుతో ఒరిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఆ ఆకును వంటల్లో ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం!

Health Benefits: మునగాకు మహిమ

హెర్బల్‌ టీ

తులసి, అల్లం, మిరియాలు.. వేటితో టీ కాచుకున్నా దాన్లో కాస్త మునగాకు పొడి వేసుకుంటే, ఆ ఆకులోని పోషకాలను పొందవచ్చు. అయితే ఇలా తయారుచేసుకునే టీలో పాలు కలుపుకోకూడదు.

స్మూదీలు, మిల్క్‌షేక్స్‌

స్మూదీలు, మిల్క్‌షేక్స్‌లో కలుపుకుని తాగడం కోసం ఒక కప్పు పాలు, అరటి పండ్లు, యాపిల్‌ ముక్కలు, ఒక టీస్పూను మోరింగ పొడిని కలిపి బ్లెండ్‌ చేసుకోవాలి.

పరాఠా, రోటీలు

పరాఠా, రోటీల తయారీ కోసం సిద్ధం చేసుకునే గోధుమ పిండిలో ఒకట్రెండు టీస్పూన్ల మోరింగ పొడి కలుపుకోవచ్చు. రుచి కోసం నిమ్మరసం, ఉప్పు, కొద్దిగా కారం కూడా కలుపుకోవచ్చు.


సూప్స్‌, పప్పులు

సూప్‌ తయారుచేసుకునేటప్పుడు ఒక టీస్పూన్‌ మోరింగ పొడి జోడించవచ్చు. ఏ పప్పు వండుకున్నా మోరింగ పొడితో కలిపి వండుకోవచ్చు. వీటి రుచిని పెంచడం కోసం అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పసుపు జోడించుకోవచ్చు.

పెరుగులో

జీలకర్ర పొడి, కీరా, క్యారట్‌ ముక్కలు, ఉప్పు, ఒక టీస్పూను మోరింగ పొడి పెరుగుకు జోడించి పెరుగు పచ్చడిలా వాడుకోవచ్చు.

బిరియానీ, పాస్తా

పాస్తా సాస్‌లో మోరింగ పొడి కలుపుకోవచ్చు. బిరియానీ వండేటప్పుడు, బియ్యంతో పాటు మోరింగ పొడి జోడించుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

Manchu Family: మేజిస్ట్రేట్ ముందు తిట్టుకొన్న మోహన్ బాబు, మనోజ్

Masthan Sai: లావణ్య, రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి 200కుపైగా వీడియోలు

Updated Date - Feb 04 , 2025 | 04:06 AM