Herbal Tea: రోజూ శంఖుపువ్వు టీ తాగితే
ABN , Publish Date - Jul 17 , 2025 | 04:57 AM
శంఖు పువ్వుల(అపరాజిత పూలు)ను దేవుడి పూజకు వాడుతుంటాం. అయితే ఈ పువ్వులతో చేసిన టీని రోజూ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం..
శంఖు పువ్వుల(అపరాజిత పూలు)ను దేవుడి పూజకు వాడుతుంటాం. అయితే ఈ పువ్వులతో చేసిన టీని రోజూ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం..
శంఖు పువ్వులతో చేసిన టీ లో కెఫిన్ ఉండదు. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఒత్తిడికి కారణమయ్యే కారిస్టాల్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి.
ఈ టీ శరీరాన్ని నిర్వీషికరణ చేయడంలో సహాయపడుతుంది.
ఇందులోని యాంటీఆక్సిడెంట్లు జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంతో ఉపకరిస్తాయి.. ఏకాగ్రతను పెంచుతాయి.
ఈ టీలోని ఫ్లేవనాయిడ్లు, పాలిఫినాయిల్స్ మంట, వాపులను తగ్గిస్తాయి.
ఈ టీ ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.
శంఖుపువ్వు టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. అలాగే వృద్ధాప్య ఛాయలను కలిగించే హానికర అణువులతో పోరాడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఎలా తయారు చేయాలి?:
స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు కప్పుల నీరు పోసి మరిగించాలి. తరువాత 5-7 శంఖుపువ్వులను ఆ నీటిలో వేసి అయిదు నిమిషాలు మరగనివ్వాలి. స్టవ్ ఆపేసి ఆ నీటిని వడకట్టి అందులో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగాలి. ఈ టీతో ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే ఇందులో పంచదార వేయకూడదు.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..