Sleep Health: లైట్ వేసుకొని పడుకొంటున్నారా
ABN , Publish Date - May 01 , 2025 | 04:07 AM
రాత్రి లైట్ వేసుకుని నిద్రపోతే మెలటోనిన్ ఉత్పత్తి తగ్గి నిద్రాభావం, ఒత్తిడి, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే చీకటి గదిలో పడుకోవడం ఉత్తమం.
కొంతమంది రాత్రిపూట గదిలో లైట్ వేసుకుని పడుకుంటారు. దీనివల్ల శరీరంలో జీవక్రియల పనితీరు, హార్మోన్ల ఉత్పత్తి ప్రభావితమై పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
గదిలో వెలుతురు ఉండ డం వల్ల శరీరంలో... నిద్రించడానికి తోడ్పడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి శాతం తగ్గుతుంది. దీంతో గాఢనిద్రలోకి జారుకోవడం సాధ్యం కాదు. ఫలితంగా ఒత్తిడి, అలసటల నుంచి శరీరానికి విశ్రాంతి లభించదు.
లైట్ వేసుకుని పడుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ పనితీరు మందగిస్తుంది. దీంతో శరీరం సరైన మోతాదులో గ్లూకోజ్‌ను శోషించుకోలేదు. ఫలితంగా టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. రక్తంలోని చక్కెర స్థాయిలో భారీగా హెచ్చుతగ్గులు ఏర్పడతాయి.
నిద్రించేటప్పుడు చుట్టూ వెలుతురు ఉంటే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీనివల్ల గుండెపై ఒత్తిడి పెరిగి పలు గుండె జబ్బులు రావచ్చు.
లైట్ వెలుతురులో పడుకోవడం వల్ల నిరాశ, మానసిక అశాంతి, చిరాకు, కోపం, తలనొప్పి, ఊబకాయం లాంటి సమస్యలు వస్తాయి. మెదడులోని న్యూరోట్రాన్స్‌మీటర్లు సమతుల్యతను కోల్పోతాయి. భావోద్వేగాల నియంత్రణ సామర్థ్యం, ఆలోచన శక్తి తగ్గుతాయి.
ప్రశాంతంగా నిద్రించాలన్నా, శరీరం పూర్తిగా విశ్రాంతి పొందాలన్నా చీకటి గదిలో పడుకోవడం మంచిది.
Also Read:
BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ
Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..