Share News

Heart Health: గుండె గట్టిగా...

ABN , Publish Date - Feb 04 , 2025 | 04:08 AM

గుండెకు హాని కలిగించే అలవాట్ల గురించి మనకు అవగాహన ఉందనుకుంటాం. కానీ గుండెకు హాని కలిగించే మనకు తెలియని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే...

Heart Health: గుండె గట్టిగా...

తీవ్రమైన ఒత్తిడి: దీర్ఘకాలం పాటు కొనసాగే కుటుంబ కలహాలు, వృత్తిపరమైన ఒత్తిడిలు గుండెకు హాని చేస్తాయి. ఇవి నేరుగా గుండె మీద ప్రభావం కనబరచకపోయినా, రక్తపోటును పెంచి పరోక్షంగా గుండెను ఒత్తిడికి లోను చేస్తాయి. ఒత్తిడితో ధూమపానం, ఆహారం మీద వ్యామోహం లాంటి అనారోగ్యకరమైన అలవాట్లు కూడా అలవడతాయి. ఇవి కూడా గుండెకు చేటు చేసేవే! కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం యోగా, ధ్యానం సాధన చేయాలి. వ్యక్తిగత, వృత్తిగత ఒత్తిడులను తగ్గించుకోవాలి.

నిద్రలేమి: నిద్ర లోపించడం, కంటినిండా నిద్రపోకపోవడం.. ఈ రెండూ జీవగడియారాన్ని అస్తవ్యస్థం చేసి, రక్తపోటును పెంచి, ఊబకాయానికి దారి తీస్తాయి. దీర్ఘకాలంలో ఈ పరిస్థితి గుండె మీద దుష్ప్రభావాన్ని కనబరుస్తుంది. కాబట్టి కచ్చితమైన నిద్రవేళలు పాటిస్తూ, నిద్రకు రెండు గంటల ముందు ఫోన్లు, టివిలకు దూరం పెట్టాలి. పడగ్గదిని సౌకర్యవంతంగా, చీకటిగా ఉంచుకోవాలి. నిద్రాభంగం కలిగించే అంశాలేవీ పడగ్గదిలో లేకుండా చూసుకోవాలి.

సూర్యరశ్మి: విటమిన్‌ డి లోపం అధిక రక్తపోటు, ఇన్‌ఫ్లమేషన్‌కూ, అంతిమంగా గుండె జబ్బులకూ దారి తీస్తుంది. కాబట్టి రోజులో కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటైనా సూర్యరశ్మికి బహిర్గతం కావాలి. అవసరాన్ని బట్టి సప్లిమెంట్లు వాడుకోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

Manchu Family: మేజిస్ట్రేట్ ముందు తిట్టుకొన్న మోహన్ బాబు, మనోజ్

Masthan Sai: లావణ్య, రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి 200కుపైగా వీడియోలు

Updated Date - Feb 04 , 2025 | 04:08 AM