Share News

Health Benefits of Eating Guava: రేగు పండ్లు తింటే..!

ABN , Publish Date - Dec 11 , 2025 | 05:38 AM

చలికాలంలోతోపాటే రేగు పండ్లు కూడా వచ్చేశాయి. తరచూ వీటిని తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. రేగు పండ్లు అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...

Health Benefits of Eating Guava: రేగు పండ్లు తింటే..!

చలికాలంలోతోపాటే రేగు పండ్లు కూడా వచ్చేశాయి. తరచూ వీటిని తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. రేగు పండ్లు అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...

  • రేగు పండ్లను తినడం వల్ల ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయి. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రక్తహీనత తగ్గుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌, చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గుండె జబ్బులు రావు.

  • పండిన రేగు పండ్లు తింటూ ఉంటే జీర్ణాశయ సమస్యలు తీరుతాయి. పేగులు శుభ్రపడతాయి. కడుపులో మంట, మలబద్దకం, అజీర్తి దరిచేరవు. జీవక్రియలు మెరుగుపడతాయి.

  • రేగు పండ్లను తీసుకోవడం వల్ల వాతావరణ మార్పులతో ఏర్పడే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. జలుబు, గొంతు నొప్పి, నిద్ర లేమితో బాధపడేవారికి ఇవి మంచి ఔషధంలా పనిచేస్తాయి.

  • చర్మ సంరక్షణకు కూడా రేగు పండ్లు తోడ్పడతాయి. రోజుకు నాలుగైదు రేగుపండ్లు తినడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది. ముడుతలు, మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం ఛాయగా మెరుస్తుంది.

  • రేగు పండ్లు.. శరీరంలో క్యాన్సర్‌ కారకాలను నిరోధిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోజూ రేగు పండ్లు తినడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకున్న వ్యర్థ పదార్థాలన్నీ విసర్జితమవుతాయి. ఊపిరితిత్తుల్లో పేరుకున్న కఫం తొలగిపోతుంది.

Updated Date - Dec 11 , 2025 | 07:04 AM