Personal Development: వ్యక్తిగత గౌరవం పెరిగేలా...
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:20 AM
మనం వ్యక్తిగతంగా ఎదగడానికి మన అలవాట్లే దోహదం చేస్తాయి. ఒక్కోసారి తెలిసీ తెలియక చేసే పొరబాట్లు నలుగురిలో...
మనం వ్యక్తిగతంగా ఎదగడానికి మన అలవాట్లే దోహదం చేస్తాయి. ఒక్కోసారి తెలిసీ తెలియక చేసే పొరబాట్లు నలుగురిలో నగుబాటుకి గురిచేస్తూ ఉంటాయి. అలాకాకుండా సమాజంలో ఉన్నతంగా నిలవాలంటే ఏవిధంగా మెలగాలో తెలసుకుందాం...
కొంతమంది వ్యక్తిగతమైన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. గంట గంటకూ కామెంట్లు, లైక్‌లు చూస్తూ ఉంటారు. అనుకున్నట్లు జరిగితే సంతోషమే. కానీ అలా కానిపక్షంలో భావోద్వేగాల మీద నియంత్రణ కోల్పోతూ ఉంటారు. దీనివల్ల మానసికంగా అశాం తి, అసహనం, కోపం పెరుగుతాయి. ఇవి వ్యక్తిగత గౌరవాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే సామాజిక మాధ్యమాల్లో గడపడాన్ని తగ్గించుకోవాలి.
కొంతమంది ఎప్పుడూ ఎదుటివారిలో తప్పులు వెతుకుతూ ఉంటారు. చిన్న చిన్న అంశాలనే పెద్దవిగా చేసి అనవసరమైన గందరగోళం సృష్టిస్తూ ఉంటారు. అలాకాకుండా తప్పు అనిపించిన అంశాన్ని నేరుగా మృదువుగా చెప్పడం మంచిది. దీనివల్ల నలుగురిలో సానుకూలంగా వ్యవహరించడం అలవడుతుంది.
వాయిదా వేసే ధోరణి చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. మీటింగ్ లేదా ఫంక్షన్‌కి వస్తానని చెప్పి ఆఖరు నిమిషంలో రానని చెప్పడం, చేయాల్సిన పనులను ఎప్పటికప్పుడు వాయిదా వేయడం లాంటివి వ్యక్తిగత గౌరవాన్ని తగ్గిస్తాయి. కాలయాపన చేయకుండా క్రమశిక్షణతో మెలగడం అలవాటు చేసుకోవాలి.