Golden Milk: గోల్డెన్ మిల్క్ తాగుదాం
ABN , Publish Date - Dec 27 , 2025 | 03:24 AM
శీతాకాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను నివారించడంలో గోల్డెన్ మిల్క్ అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక గ్లాసు గోల్డెన్ మిల్క్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే...
శీతాకాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను నివారించడంలో గోల్డెన్ మిల్క్ అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక గ్లాసు గోల్డెన్ మిల్క్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే...
స్టవ్‌మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలు పోసి అర చెంచా పసుపు, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా మరిగించాలి. తరువాత పాలను స్టవ్ మీద నుంచి దించి గ్లాసులో పోయాలి. అందులో ఒక చెంచా బెల్లం పొడి లేదా తేనె కలిపి ఉదయాన్నే అల్పాహారానికి ముందు లేదా రాత్రి పడుకునేముందు తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. రోగనిరోధక శక్తి పెరిగి అంటువ్యాధులు దరిచేరవు.
చలి వల్ల నిద్ర సరిగా పట్టనివారికి ఈ పాలు ఔషధంలా పనిచేస్తాయి. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనోయాసిడ్.. ఒళ్లు నొప్పులను తగ్గించి గాఢమైన నిద్ర వచ్చేలా చేస్తుంది. మిరియాల్లో ఉండే పైపెరిన్ అనే ఆల్కలాయిడ్ సమ్మేళనాలు.. జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి.
పాలలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు కలిసి చర్మాన్ని తేమతో నింపుతాయి. దీంతో చర్మం మృదువుగా చక్కని ఛాయతో మెరుస్తుంది. ఎముకలు బలోపేతమవుతాయి.
గోల్డెన్ మిల్క్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్.. చలికాలంలో ఎదురయ్యే కీళ్లవాతాన్ని, కండరాల సమస్యలను నివారిస్తుంది. జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి రుగ్మతల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.