Share News

OTT: ఈ వారమే విడుదల

ABN , Publish Date - Feb 10 , 2025 | 03:52 AM

‘ధూమ్‌ధామ్‌’గా పెళ్లి చేసుకొని ఎంతో ఆనందంగా హనీమూన్‌కు సిద్ధమైన ఆ దంపతుల తొలి రాత్రే కాళరాత్రి అవుతుంది.

OTT: ఈ వారమే విడుదల

ఈ సోమవారం నుంచి వచ్చే శనివారంలోగా

విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

jhu;.jpg

చార్లీ ఆచూకీ తెలిసిందా?

వీర్‌ ఖురానా, కోయల్‌ చద్దాలది పెద్దల కుదుర్చిన పెళ్లి. పెళ్లయిన మొదటి రోజే వారిపై ఓ క్రిమినల్‌ గ్యాంగ్‌ దాడి చేస్తుంది. ‘ధూమ్‌ధామ్‌’గా పెళ్లి చేసుకొని ఎంతో ఆనందంగా హనీమూన్‌కు సిద్ధమైన ఆ దంపతుల తొలి రాత్రే కాళరాత్రి అవుతుంది. అనుకోని ఆపద వారి జీవితాలను ఎలాంటి ప్రమాదంలోకి నెట్టింది? దాని నుంచి బయటపడేందుకు వారు చేసిన ప్రయత్నాలేంటి? ఈ నేపథ్యంలో ఉత్కంఠభరితంగా సాగే చిత్రం ‘ధూమ్‌ధామ్‌’. ‘చార్లీ ఆచూకీ చెప్పండి’ అంటూ వేధిస్తున్న గ్యాంగ్‌లోని కొందరు కథానాయిక చేతిలో చావు దెబ్బలు తిని, భంగపడతారు. ఇక అప్పటినుంచి హీరో, హీరోయిన్లు, విలన్‌ గ్యాంగ్‌ మధ్య వచ్చే సన్నివేశాలు ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తుతాయి. ఈ చిత్రాన్ని రిషభ్‌సేత్‌ దర్శకత్వంలో జియో స్టూడియోస్‌ నిర్మించింది. యామీ గౌతమ్‌, ప్రతీక్‌ గాంధీ, పవిత్రా సర్కార్‌ ప్రధాన తారాగణం.

Updated Date - Feb 10 , 2025 | 03:52 AM