ఏ కలా పెద్దది కాదు
ABN , Publish Date - May 07 , 2025 | 12:57 AM
‘‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాననే మాట ఇదివరకు బాగా వినిపించేది కదా! నా విషయంలోనూ అలాగే జరిగింది. నేను డాక్టర్ అవ్వాలనుకున్నా... ఐఎఎ్‌సనయ్యాను. చిన్న వయసు నుంచీ వైద్యురాలు కావాలనేది నా కల. అయితే పదోతరగతికి...

పేదరికం, సామాజికమైన ఆంక్షలు, వరుస వైఫల్యాలు...
ఏ పరిస్థితులు ఎదురైనా చెక్కుచెదరని సంకల్పంతో లక్ష్యాన్ని సాధించారు
అదిబా అనమ్. ఆటో డ్రైవర్ కుమార్తె అయిన ఆమె సివిల్స్‌లో ఎంపికై,
మహారాష్ట్రలో తొలి ముస్లిం మహిళా ఐఏఎ్‌సగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
‘పేదలకు సేవ చేయాలనే నా ఆశయంలో ఇది తొలి అడుగు’
అంటున్న అదిబా స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఇది.
‘‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాననే మాట ఇదివరకు బాగా వినిపించేది కదా! నా విషయంలోనూ అలాగే జరిగింది. నేను డాక్టర్ అవ్వాలనుకున్నా... ఐఎఎ్‌సనయ్యాను. చిన్న వయసు నుంచీ వైద్యురాలు కావాలనేది నా కల. అయితే పదోతరగతికి వచ్చేసరికి... అది సాధ్యమయ్యే పని కాదని అర్థమయింది. కారణం మా ఆర్థిక పరిస్థితులు. దేశంలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉండే రాష్ట్రం మహారాష్ట్ర అయితే... అందులో అత్యధిక శాతం చోటు చేసుకున్నది మా యవత్మాల్ జిల్లాలోనే. గత 24 ఏళ్ళలో 6,200 మందికి పైగా రైతులు మా జిల్లాలో బలవన్మరణాలపాలయ్యారని ఈ నెల మొదటివారంలో విడుదలైన అధికారిక నివేదిక చెబుతోంది. కానీ ఆ సంఖ్య ఇంకా ఎన్నో రెట్లు ఉంటుంది. ఈ నేపథ్యంలో... వ్యవసాయ పనులు వదిలేసి ఇతర వృత్తులను చేపట్టిన వేలాది మందిలో మా నాన్న అష్ఫక్ షేక్ ఒకరు. బాగా చదువుకోవాలని నాన్నకు ఎంతో ఆశ. కానీ ఆయన పదో తరగతి మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. తొలి సంతానమైన నా ద్వారా తన కల తీర్చుకుందామని అనుకున్నారు.
ఎంతో ఒత్తిడి ఎదుర్కొన్నాం...
అమ్మా నాన్నా, నేను, ఇద్దరు తమ్ముళ్ళు... ఇదీ మా కుటుంబం. నాన్న అద్దె ఆటో నడిపి తెచ్చే సంపాదనతోనే కుటుంబం గడవాలి, మా చదువులు కొనసాగాలి. ఉండేది అద్దె ఇల్లే అయినా, ఎలాంటి ఆస్తులూ లేకపోయినా... ఏనాడూ మా తల్లితండ్రులు అధైర్యపడలేదు. పదో తరగతిలో 98 శాతం, ఇంటర్‌లో 97 శాతం మార్కులు తెచ్చుకున్నా. అప్పుడే యుపిఎ్‌ససికి ప్రిపేర్ కావాలనే ఆలోచన వచ్చింది. దానికి కారణం పుణేలో ఉన్న మా మామయ్య. అతను ‘సేవా ఎన్జీవో’ అనే సంస్థలో కార్యదర్శిగా పని చేస్తారు. ఆ సంస్థ కార్యక్రమాలకు హాజరయ్యే ఐఎఎస్ అధికారులకు నన్ను పరిచయం చేశారు. ఎంబీబీఎస్ ఆశ వదులుకున్న నాకు... ఐఎఎస్ కొత్త లక్ష్యంగా మారింది. పుణేలోనే డిగ్రీలో చేరాను. గణితంలో గ్రాడ్యుయేషన్ చేస్తూ... సివిల్స్ కోసం సన్నద్ధం కావడం మొదలుపెట్టాను. ఆ సమయంలో నేను, నా కుటుంబం ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది.
కాదు. ఏ లక్ష్యమూ మరీ దూరం కాదు. కావలసిందల్లా మన మీద మనకు విశ్వాసం. చిత్తశుద్ధితో ప్రయత్నించడం. నాలాంటి అమ్మాయిలు నన్ను ప్రేరణగా తీసుకొని... ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేస్తారనే నమ్మకం నాకుంది.
ఎందరో సలహాలిచ్చారు...
మా ముగ్గుర్ని చదివించడం కోసం నాన్న ఆర్థికంగా పడుతున్న సమస్యలకు తోడు కమ్యూనిటీపరంగానూ ఇబ్బందులు ఎదురయ్యాయి. ‘‘ఆడపిల్లకు పెద్ద చదువులు ఎందుకు? ఎక్కడో ఉంచి చదివించడం ఏమిటి? నీ స్థోమత తెలిసే చేస్తున్నావా? పెళ్ళి చేసి పంపెయ్. ఇంకా ఇద్దరు మగ పిల్లలున్నారు నీకు’’ అంటూ నాన్నకు ఎందరో సలహాలు ఇచ్చారు. కానీ నా తల్లితండ్రులు నా మీద నమ్మకం ఉంచారు. ‘‘సమాజం గురించి నువ్వు పట్టించుకోకు. నీ లక్ష్యం మీదే ఏకాగ్రత పెట్టు’’ అని చెప్పారు. నా మీద సామాజికమైన ఒత్తిడి ఎన్నడూ పడనివ్వలేదు. కానీ పరిస్థితి ఏమిటనేది నాకు తెలుసు. అందుకే ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యాను. పరీక్ష రాశాను. ఒకసారి ఫెయిల్ అయ్యాను. రెండోసారి కూడా దగ్గరగా వచ్చినా వైఫల్యం ఎదురయింది. దాంతో నా పట్టుదల మరింత పెరిగింది. మూడోసారి ఇంటర్వ్యూ వరకూ వెళ్ళాను. కానీ అప్పుడు కూడా ఆశాభంగం తప్పలేదు. ‘‘ఇక ఇవన్నీ ఆపెయ్, ఏదైనా ఉద్యోగం చూసుకో. పెళ్ళి చేసుకో. ఇక నీ వల్ల కాదు’’ అనే సలహాలు బంధువులు, మిత్రుల నుంచి కూడా వినిపించాయి. కానీ ‘‘నువ్వు సాధించగలవు. మరింత గట్టిగా ప్రయత్నించు’’ అంటూ నా కుటుంబం నా వెనుక నిలిచింది. ‘ఇప్పటివరకూ నేను చేసిన పొరపాట్లేమిటి?’ అని మరోసారి విశ్లేషించుకున్నాను. ‘ఓటములు జీవితంలో భాగం. వాటి నుంచి పాఠాలు నేర్చుకొని, కొత్త అడుగులను స్థిరంగా, సక్రమంగా వేయాలి. అప్పుడే మరింత బలంగా తయారవుతాం’ అని నమ్మాను. నాలుగోసారి నా గురి తప్పలేదు. ఈసారి ఇంటర్వ్యూ కూడా బాగా చేశాను. ఫలితాల్లో నాకు 142వ ర్యాంక్ వచ్చింది. మహారాష్ట్రలో తొలి ముస్లిం మహిళా ఐఎఎ్‌సను నేనేనని అప్పటివరకూ నాకు తెలీదు. అది గొప్ప విషయంగా కూడా అనుకోవడం లేదు.’’
అందుకోసం కృషి చేస్తా...
సమాజానికి సేవ చెయ్యడానికి ఇది మొదటి అడుగుగా భావిస్తున్నాను. పేదల శ్రేయస్సుకు, ముఖ్యంగా బాలికల చదువు కోసం నా వంతు కృషి చేస్తాను. విద్య, వైద్యం... ఈ రెండూ ఎవరికైనా చాలా ముఖ్యం. అట్టడుగు వర్గాలకు అవి అందేలా చూడాలనుకుంటున్నాను. నేను చాలా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చాను. పెద్ద నగరాల్లో చదవలేదు. స్థిరమైన ఆదాయం ఉన్న కుటుంబం కాదు. కానీ ఒక లక్ష్యం నిర్దేశించుకున్నాను. ఆ దిశగా కృషి చేశాను. ఏ కలా మరీ పెద్దది
ఇవి కూడా చదవండి
Security rill: రేపే సెక్యూరిటీ డ్రిల్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..