Share News

Reduce Stress Naturally: వీటిని తినాలి..!

ABN , Publish Date - Dec 27 , 2025 | 03:22 AM

రోజూ చదువు, ఉద్యోగం, వ్యాపారాల్లో ఎదురయ్యే సవాళ్ల కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు హార్మోన్లను సంతులనం చేసే పోషకాహారం తీసుకుంటే సమస్య తీరుతుందని నిపుణులు చెబుతున్నారు.

Reduce Stress Naturally: వీటిని తినాలి..!

  • రోజూ చదువు, ఉద్యోగం, వ్యాపారాల్లో ఎదురయ్యే సవాళ్ల కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు హార్మోన్లను సంతులనం చేసే పోషకాహారం తీసుకుంటే సమస్య తీరుతుందని నిపుణులు చెబుతున్నారు.

  • మెగ్నీషియం, ఫోలిక్‌ యాసిడ్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పాలకూర, తోటకూర, మెంతి కూర, క్యాబేజీ, బ్రోకలీ, చిలగడ దుంపలు, కోడిగుడ్లు లాంటివాటిని ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో కార్టిసాల్‌ ప్రభావం తగ్గి ఒత్తిడి, ఆందోళన మాయమవుతాయి.

  • తరచూ స్ట్రాబెర్రీ, బ్లాక్‌ బెర్రీ, నల్ల ద్రాక్ష, అనాస, నారింజ, అరటి పండ్లు తింటూ ఉంటే ఒత్తిడి తగ్గుతుంది.

  • చియా సీడ్స్‌, అవిశె గింజలు, పెరుగును ఆహారంలో చేర్చుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్‌, డి విటమిన్‌ అధికంగా ఉండే చేపలను తీసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.

  • బ్రౌన్‌ రైస్‌, ఓట్‌మీల్‌, గోధుమ బ్రెడ్‌, తృణధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు, సెరటోనిన్‌ విడుదలై ఒత్తిడిని తగ్గిస్తాయి. జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్‌నట్స్‌, కిస్‌మి్‌స, డ్రై అంజూర్‌, ఖర్జూరాలు తింటున్నా ప్రయోజనం ఉంటుంది.

  • రోజూ మితంగా డార్క్‌ చాక్లెట్‌ తీసుకున్నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. గోరువెచ్చని పాలు లేదా ఏదైనా హెర్బల్‌ టీ తాగినా ఫలితం కనిపిస్తుంది.

Updated Date - Dec 27 , 2025 | 03:22 AM