Flowers for Beauty: పువ్వులతో అందం
ABN , Publish Date - Aug 04 , 2025 | 03:28 AM
అమ్మాయిలు సున్నితం అని చెప్పడానికి వారిని పువ్వులతో పోల్చుతారు. పూలను సౌందర్య ఉత్పత్తుల తయారీలో వాడతారు. అయితే ఇంటి పెరట్లో పెంచుకునే పువ్వులు కూడా...
అమ్మాయిలు సున్నితం అని చెప్పడానికి వారిని పువ్వులతో పోల్చుతారు. పూలను సౌందర్య ఉత్పత్తుల తయారీలో వాడతారు. అయితే ఇంటి పెరట్లో పెంచుకునే పువ్వులు కూడా అనేక చర్మ సమస్యలను దూరం చేసి సొగసుకు సొబగులు అద్దుతాయి. ఆ సంగతులివీ..
కేశాల సంరక్షణలో ముందుండే మందార పూలు చర్మ సంరక్షణకూ తోడ్పడతాయి. ఇందులోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై మచ్చలను, పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తాయి. విటమిన్ సి చర్మం నిగారించేలా చేస్తుంది. మందారపూలను రుబ్బి ఫేస్‌ప్యాక్ వేసుకుంటే పలు చర్మ సమస్యలు దూరమవుతాయి.
మల్లెపూలు సుగంధాలను వెదజల్లడంతో పాటు చర్మ ఆరోగ్యానికీ సహాయపడతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మొటిమలు, మచ్చలను నివారిస్తాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. మల్లె పూలు చర్మంపై దురద, వాపు, మచ్చలు వంటి సమస్యలు దూరం చేస్తాయి. మల్లెపూలను రుబ్బి ఆ పేస్టులో కొంచెం కొబ్బరి నూనె కలిపి ఫేస్‌ప్యాక్ వేసుకుంటే చర్మం నిగారిస్తుంది.
బంతి పూలలో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలం. ఇవి చర్మంపై గాయాలను మాన్పుతాయి. ముడతలు, వృద్ధాప్య ఛాయలను నివారించడంలోనూ బంతిపూలు ఉపయోగపడతాయి. బంతిపూలను మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకోవాలి.