Share News

OTT: ఈ వారమే విడుదల

ABN , Publish Date - Feb 03 , 2025 | 04:36 AM

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

OTT: ఈ వారమే విడుదల

దాయాది దేశాల క్రికెట్‌ చరిత్ర

ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరుగుతుందంటే చాలు క్రికెట్‌ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. అయితే కొంతకాలంగా ఈ రెండు జట్లు ముఖాముఖి తలపడింది తక్కువే. త్వరలో ఛాంపియన్స్‌ ట్రోపీలో బరిలో దిగనున్నాయి. ఈ సందర్భంగా భారత్‌, పాక్‌ క్రికెట్‌ జట్ల చరిత్రను వివరిస్తూ నెట్‌ఫ్లిక్స్‌ ‘ది గ్రేటెస్ట్‌ రైవల్రీ: ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌’ పేరుతో ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. ఇందులో ప్రపంచకప్‌, టీ 20 ప్రపంచకప్‌, ఆసియాక్‌పలాంటి మెగా టోర్నీల్లో జరిగిన పలు ఉత్కంఠభరిత మ్యాచ్‌లను మళ్లీ వీక్షించవచ్చు. రెండు జట్లు పోటీపడిన పలు మ్యాచ్‌లకు సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలను క్రికెట్‌ ప్రేమికులు మరోసారి గుర్తుచేసుకోవచ్చు.

hj.jpg

Updated Date - Feb 03 , 2025 | 04:36 AM