Share News

Weight Loss: అదనపు కొవ్వు తగ్గేదెలా?

ABN , Publish Date - Oct 20 , 2025 | 05:39 AM

మహిళలు సాధారణంగా పొత్తి కడుపు, చేతులు, తుంటి భాగాల్లో చేరే అదనపు కొవ్వుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. హార్మోన్ల అసమతౌల్యం, పరిమితికి ...

Weight Loss: అదనపు కొవ్వు తగ్గేదెలా?

మహిళలు సాధారణంగా పొత్తి కడుపు, చేతులు, తుంటి భాగాల్లో చేరే అదనపు కొవ్వుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. హార్మోన్ల అసమతౌల్యం, పరిమితికి మించి బరువు పెరగడమే దీనికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఆహార నియమాలు పాటిస్తూ, వర్కవుట్స్‌ చేస్తూ, చిన్న చిట్కాలతో అదనపు కొవ్వును ఎలా కరిగించుకోవాలో తెలుసుకుందాం...

  • రాత్రిపూట సరిగా నిద్రపోకపోవడం వల్ల పొత్తికడుపు భాగంలో కొవ్వు పేరుకుంటుంది. రోజుకు కనీసం ఎనిమిది గంటలపాటు హాయిగా పడుకుంటే ఒత్తిడి తగ్గి సమస్య తీరుతుంది. స్వీట్లు, కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా తీసుకోకూడదు. తాజా పండ్లు, పెరుగు, డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంలో చేర్చుకోవాలి. దీంతోపాటు రోజూ పదివేల అడుగులు వేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

  • నూనె పదార్థాలు, జంక్‌ ఫుడ్‌ అధికంగా తీసుకోవడం వల్ల భుజాలు, చేతుల్లో విపరీతంగా కొవ్వు చేరుతుంది. కేకులు, పేస్ట్రీలు, ప్రాసెస్‌ చేసిన పదార్థాలను తినడం పూర్తిగా మానేస్తే చేతుల్లోని కొవ్వు కరిగిపోతుంది. ప్రొటీన్‌, ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. రోజుకు రెండు గుడ్లు తినడం శ్రేయస్కరం. చేతులను తరచూ కదిలిస్తూ ఉండాలి. ఆర్మ్‌ సర్కిల్స్‌, షాడో బాక్సింగ్‌, వాల్‌ పుషప్స్‌, బైసెన్‌ కర్ల్స్‌ లాంటి తేలికైన వర్కవుట్స్‌ చేస్తూ ఉంటే అదనపు కొవ్వు కరిగి చేతులు సన్నగా, అందంగా మారతాయి.

  • రోజూ రన్నింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌, బ్రిస్క్‌ వాకింగ్‌ చేస్తూ ఉంటే తుంటి భాగంలో పేరుకున్న కొవ్వు మాయమవుతుంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, అవకాడో, ఆలివ్‌ ఆయిల్‌ను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. మంచినీళ్లు ఎక్కువగా తాగడం, శారీరక శ్రమ, యోగ లేదా ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే సత్వరమైన ఫలితం లభిస్తుంది.

Updated Date - Oct 20 , 2025 | 05:39 AM