Share News

Cleaning Shoes: బూట్లు శుభ్రంగా ఇలా

ABN , Publish Date - Aug 04 , 2025 | 01:09 AM

వర్షాకాలంలో తరచూ బురద అంటుకోవడం వల్ల బూట్లు మురికిగా మారుతూ ఉంటాయి. వాటిని శుభ్రం చేయడం కష్టంగా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా తెల్లటి బూట్లకు...

Cleaning Shoes: బూట్లు శుభ్రంగా ఇలా

వర్షాకాలంలో తరచూ బురద అంటుకోవడం వల్ల బూట్లు మురికిగా మారుతూ ఉంటాయి. వాటిని శుభ్రం చేయడం కష్టంగా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా తెల్లటి బూట్లకు అంటిన మరకలు త్వరగా వదలవు. చిన్న చిట్కాలు పాటించి బూట్లను ఎలా మెరిపించాలో తెలుసుకుందాం...

  • వాతావరణంలో తేమ కారణంగా ఒక్కోసారి బూట్ల మీద ఫంగస్‌ చేరుతూ ఉంటుంది. అలాంటప్పుడు బూట్లకు నిమ్మరసం రాయాలి. పది నిమిషాల తరవాత టిష్యూ పేపర్‌ లేదా పలుచని వస్త్రంతో తుడిస్తే మురికి పూర్తిగా వదిలిపోతుంది. వెనిగర్‌లో ముంచిన దూదితో బూట్లను తుడిచినా మంచి ఫలితం కనిపిస్తుంది.

  • ఒక గిన్నెలో రెండు చెంచాల బేకింగ్‌ సోడా, కొన్ని నీళ్ల చుక్కలు వేసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని బూట్లకు అంటిన మరకల మీద రాయాలి. అయిదు నిమిషాల తరవాత తడి గుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది.

  • ఒక గిన్నెలో రెండు చెంచాల లిక్విడ్‌ డిటర్జెంట్‌ వేసి రెండు చెంచాల వేడినీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బూట్లకు పట్టించాలి. అయిదు నిమిషాల తరవాత మెత్తని బ్రష్‌తో రుద్ది తడి స్పాంజ్‌తో శుభ్రంగా తుడిచేస్తే బూట్లు కొత్తవాటిలా మెరుస్తాయి.

  • లెదర్‌ బూట్ల మీద కొద్దిగా బాడీ లోషన్‌ రాయాలి. అయిదు నిమిషాల తరవాత పలుచన్ని వస్త్రంతో తుడిచేస్తే మురికి మొత్తం వదిలిపోతుంది.

  • కాన్వాస్‌ బూట్ల మీద పాత టూత్‌బ్ర్‌షతో మెల్లగా రుద్దితే చాలావరకు మురికి తొలగిపోతుంది. తరవాత తడిగుడ్డను అద్దుతూ తుడిస్తే బూట్లు పూర్తిగా శుభ్రమవుతాయి.

  • తెల్లటి బూట్లు మారికిగా మారినప్పుడు వాటి మీద తెల్లని టూత్‌పే్‌స్ట రాయలి. రెండు నిమిషాల తరవాత వాటిపై కొన్ని నీళ్ల చుక్కలు చల్లాలి. వెంటనే పాత టూత్‌బ్ర్‌షతో రుద్ది పొడిగుడ్డ లేదా స్పాంజ్‌తో తుడిచేస్తే మరకలన్నీ తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

కొత్త రూల్.. పావురాలకు తిండిపెడితే జైలుకే..

13 ఏళ్ల కూతురితో కలిసి భర్తను చంపేసిన భార్య

Updated Date - Aug 04 , 2025 | 01:09 AM