Dark Chocolate: డార్క్ చాక్లెట్‌తో బీపీకి చెక్
ABN , Publish Date - May 27 , 2025 | 04:41 AM
డార్క్ చాక్లెట్, ద్రాక్ష, యాపిల్, టీ వంటి ఫ్లేవనాయిడ్ పదార్థాలు అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధకులు తేల్చారు. అయితే ఇవి మందులకు ప్రత్యామ్నయం కావు, సమతుల్య ఆహారం, వ్యాయామంతో పాటు మందులు కూడా అవసరమే.
చాక్లెట్‌ను ఇష్టపడని వారుండరు. అయితే డార్క్ చాక్లెట్ ర్తపోటును తగ్గిస్తుందని ఓ తాజా అధ్యయనంలో తేలింది. ఆ వివరాలు తెలుసుకుందాం..
యూకే యూనివర్సిటీ ఆఫ్ సర్రే పరిశోధకులు తాజాగా చేపట్టిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. డార్క్ చాక్లెట్, ద్రాక్ష, యాపిల్, టీలను రోజూ తీసుకుంటే అధిక రక్తపోటు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురితమైన ఆ అధ్యయనంలో వెల్లడైంది. ఫ్లేవనాయిడ్ సమ్మేళనాలు రక్తపోటును నియంత్రిస్తాయనీ, గుండె ఆరోగ్యంలో ముఖ్య పాత్ర పోషించే రక్తనాళాల లోపలి సన్నని పొర ఎండోథీలియం పనితీరును మెరుగుపరుస్తాయనీ పరిశోధకులు అధ్యయనంలో కనుగొన్నారు. కోకో, బ్లాక్ టీ, గ్రీన్ టీ, యాపిల్స్, బెర్రీలు, ద్రాక్షలు వంటి వాటిలో ఫ్లేవనాయిడ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. అందుకే ఈ ఆహార పదార్థాలను కొద్దిమొత్తంలో రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అయితే ఈ ఆహార పదార్థాలు వైద్యులు సూచించే మందులకు ప్రత్యామ్నాయం కాదని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 128 కోట్ల మంది ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు... గుండెపోటు, గుండె వైఫల్యం, మూత్రపిండాల వ్యాధులు లాంటి ప్రాణాంతక సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి రక్తపోటును నియంత్రించే మందులు వాడుకోవడంతో పాటు, సమతులాహారం తీసుకుంటూ, శారీరకంగా చురుగ్గా ఉంటూ, ధూమపానం, మద్యపానాలకు దూరంగా ఉండాలి.
ఈ వార్తలు కూడా చదవండి
ఆ పోటీలకు కోట్లల్లో ఖర్చు.. మరి రైతులకు.. హరీష్ సూటి ప్రశ్న
బీజేపీని టార్గెట్ చేసిన కేటీఆర్.. వీడియోలతో సెటైర్లు
Read Latest Telangana News And Telugu News