Antibiotics: మందులు - పదార్థాలు
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:20 AM
కొన్ని పదార్థా లు మందుల ప్రభావాన్ని పక్కదోవ పటిస్తాయి. ఇంకొన్ని ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడతాయి.
కొన్ని పదార్థా లు మందుల ప్రభావాన్ని పక్కదోవ పటిస్తాయి. ఇంకొన్ని ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడతాయి. కాబట్టి కొన్ని మందులను నిర్దిష్ట పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. అవేంటో తెలుసుకుందాం!
మాక్సిఫ్లాక్సాసిన్, సిప్రోఫ్లాక్సాసిన్, లివోఫ్లాక్సాసిన్ మొదలైన ఫ్రోరోక్వినోలోన్స్ కలిగిన కొన్ని యాంటీబయాటిక్స్‌ను పాలు, పెరుగు, జన్నులతో కలిపి తీసుకోకూడదు. ఈ పాల ఉత్పత్తులు యాంటీబయాటిక్స్‌తో కలిసిపోయి, వాటి శోషణను కుంటుపరుస్తాయి
కొన్ని టెట్రాసైక్లిన్ మందులు కూడా పాల ఉత్పత్తులతో కలిసి ప్రతికూల ప్రభావాన్ని కనబరుస్తాయి. కాబట్టి ఈ మందులు తీసుకోడానికి రెండు గంటల ముందు నుంచి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి
హ్యాంగోవర్‌కు విరుగుడుగా అసిటమినోఫిన్ లేదా పారాసిటమాల్ తీసుకోకూడదు. మద్యం, అసిటమినోఫిన్ లేదా పారాసిటమాల్ మిశ్రమం కాలేయ టాక్సిసిటీని పెంచుతుంది
వార్ఫారిన్ రక్తాన్ని పలుచబరిచే మందు. విటమిన్ కె సమృద్ధిగా ఉండే పాలకూర, బ్రొకొలిలతో కలిపి వార్ఫారిన్‌ను తీసుకుంటే, ఈ మందు ప్రభావం తగ్గుతుంది. వీటితో పాటు మయొనిస్, ఆలివ్ నూనె, సోయా నూనె, కనోలా నూనెలు కూడా ఈ మందు ప్రభావాన్ని తగ్గిస్తాయి.
మద్యం, ఇన్సులిన్‌తో పాటు ఇతర మధుమేహ మందుల మీద ప్రభావం కనబరుస్తుంది. ఈ మందులను మద్యంతో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర తగ్గిపోయి హైపోగ్లైసీమియాకు గురి కావచ్చు లేదా పెరిగిపోయి హైపర్‌గ్లైసీమియాకు లోను కావచ్చ్ఝు.