Sandwich: శాండ్‌విచ్‌లు అందంగా...
ABN , Publish Date - Jun 02 , 2025 | 04:45 AM
అతిథుల కోసం శాండ్‌విచ్‌లను ఆకర్షణీయంగా తయారుచేసేందుకు త్రిభుజాకార బ్రెడ్, కూరగాయలు, టాపింగ్స్ వాడాలి. శాండ్‌విచ్ పేపర్‌తో చుట్టి, అందంగా పళ్లెంలో అమర్చితే చూడగానే ఆకట్టుకుంటుంది.
మనం సాధారణంగా శాండ్‌విచ్‌లు చేసుకుని తింటూ ఉంటాం. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు మాత్రం వాటిని అందంగా రూపొందించి చక్కగా పళ్లెంలో అమర్చాలని అనుకుంటాం. చూడగానే ఆకట్టుకునేలా శాండ్‌విచ్‌లను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...
ఒక బ్రెడ్‌ను తీసుకుని రెండు త్రిభుజాకారపు ముక్కలుగా కోయాలి. రెంటినీ ఒకదాని పక్కన మరోదాన్ని కాస్త ఎడంగా పెట్టాలి. వీటిపైన పాలకూర ఆకును పెట్టాలి. దీనిమీద టమాటా ముక్కలు, ఛీజ్ తురుం, కొత్తిమీర చీలికలు, ఇతర కూరగాయల ముక్కలు (కేరట్, కీరా, బీట్‌రూట్ లాంటివి) అమర్చాలి.
ఈ రెండు త్రిభుజాకారపు బ్రెడ్ ముక్కలను ఒకదానితో మరోదాన్ని మూసివేయాలి. లోపల ఉన్న కూరగాయల ముక్కలు పడిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒక పొడవాటి ప్లాస్టిక్ కవర్‌తో ఈ రెండు ముక్కలను కలిపి చుట్టాలి.
ఒక శాండ్‌విచ్ పేపర్‌ను తీసుకుని పొడవాటి దీర్ఘచతురస్రాకారంలో కత్తిరించాలి. ఈ పేపర్‌తో ముందుగా తయారుచేసుకున్న శాండ్‌విచ్‌ను కోన్ మాదిరి చుట్టాలి. తరవాత ఒక పళ్లెంలో జాగ్రత్తగా పెట్టాలి. శాండ్‌విచ్ పేపర్‌మీద సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏదైనా రాయవచ్చు.
పళ్లెంలో ఖాళీ ఉన్నట్లయితే కూరగాయల ముక్కలను అందమైన ఆకృతుల్లో పేర్చవచ్చు. అవసరమైతే మొలకలు, డ్రైఫ్రూట్స్ కూడా చేర్చవచ్చు.
ఇవీ చదవండి:
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి