Coconut Payasam: ఊబకాయులకు ఔషధం కొబ్బరి పాయసం
ABN , Publish Date - Dec 27 , 2025 | 03:25 AM
కొబ్బరి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ భావ ప్రకాశ, భోజన కుతూహలం వంటి గ్రంథాలు కొబ్బరి పాల వల్ల కలిగే అనేక ప్రయోజనాలను వివరించాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ..
కొబ్బరి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ భావ ప్రకాశ, భోజన కుతూహలం వంటి గ్రంథాలు కొబ్బరి పాల వల్ల కలిగే అనేక ప్రయోజనాలను వివరించాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి పాలతో చేసిన పాయసాన్ని ‘అతిపుష్టిదాఖ’ అని ఈ గ్రంథాల్లో పేర్కొన్నారు. అంటే కొబ్బరి పాయసం వల్ల శరీరానికి మంచి పోషణ లభిస్తుందని అర్ధం. ముఖ్యంగా బడికి వెళ్లే పిల్లలకు ఇది మేలు చేస్తుంది. వారి అలసటను తీరుస్తుంది.
కొబ్బరి పాల పాయసం వాత వ్యాధులున్నవారికి మంచి మందు. ఇది నిద్రలేమితో బాధపడేవారికి నిద్ర కలిగేలా చేస్తుంది.
మహిళల్లో రక్తస్రావాన్ని అరికడుతుంది.
కనీసం వారానికి ఒక సారి కొబ్బరి పాయసం తాగితే చర్మం మెరుస్తుంది.
స్థూలకాయులు కొబ్బరి పాయాన్ని క్రమం తప్పకుండా తాగితే కొవ్వు కరిగి సన్నబడతారు. వారానికి రెండు సార్లు చొప్పున మూడు నెలల పాటు కొబ్బరి పాయసాన్ని సేవిస్తే మంచి ఫలితాలుంటాయి.
కొందరికి నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటి వారికి ఇది ఒక మంచి ఔషధం.
ఎసిడిటి, ఎక్కిళ్లు వంటి సమస్యలకు కూడా కొబ్బరి పాయసం ఒక మంచి పరిష్కారం.
పాయసం ఎలా చేయాలి?
కొబ్బరిని సన్నగా తురమాలి.
ఈ కొబ్బరి తురుమును ఆవు పాలలో వేసి ఉడికించాలి.
పాలు చిక్కగా అవటం మొదలుపెట్టిన తర్వాత పంచదార, నెయ్యి వేయాలి.
చివరలో కుంకమపువ్వు, పచ్చ కర్పూరం, యాలకులు వేసుకుంటే మంచి సువాసన కలుగుతుంది.