Share News

Wearing cooling glasses with proper UV protection: కూలింగ్‌ గ్లాసెస్‌ అవసరమే

ABN , Publish Date - Dec 11 , 2025 | 05:41 AM

డాక్టర్‌! ఎండలోకి వెళ్లిన ప్రతిసారీ కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకోవడం అవసరమా? ఎలాంటి చలువ కళ్లజోడు ఎంచుకోవాలి? వీటి ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి...

Wearing cooling glasses with proper UV protection: కూలింగ్‌ గ్లాసెస్‌ అవసరమే

డాక్టర్‌! ఎండలోకి వెళ్లిన ప్రతిసారీ కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకోవడం అవసరమా? ఎలాంటి చలువ కళ్లజోడు ఎంచుకోవాలి? వీటి ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

- ఓ సోదరి, హైదరాబాద్‌

ఎండ, వేడి, అతినీలలోహిత కిరణాలు, రేడియేషన్‌... వీటన్నిటి నుంచి కళ్లకు రక్షణ కల్పించాలంటే చలువ కళ్లద్దాలు ధరించాలి. సాధారణంగా మార్కెట్లో ఎన్నో రకాల కూలింగ్‌ గ్లాసెస్‌ దొరుకుతూ ఉంటాయి. వాటిలో చవకవీ, ఖరీదైనవీ ఉంటాయి. వీటిలో ఏది కొనాలి? అనే విషయంలో అయోమయానికి గురవుతూ ఉంటాం. అయితే వీటిలో వేటితోనైనా కళ్లకు రక్షణ దొరుకుతుంది. అయితే వాటికి అతినీలలోహిత కిరణాలను అడ్డుకునే ‘యువి ప్రొటెక్షన్‌’ ఉందా? అన్నది తెలుసుకోవాలి. చవక చలువ కళ్లద్దాలతో పోలిస్తూ ఖరీదైన ప్రముఖ కంపెనీ ఉత్పత్తులు ఈ ఫిల్మ్‌ విషయంలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తాయి. కాబట్టి కళ్లకు పూర్తి రక్షణ కావాలనుకుంటే, మన్నికైన, నాణ్యమైన కూలింగ్‌ గ్లాసెస్‌నే ఎంచుకోవాలి. తక్కువ ఖర్చులో చలువ కళ్లజోడు కొనే సమయంలో వాటి అద్దాల నాణ్యత పరిశీలించాలి. ఛత్వారం ఉన్న వాళ్లు ఎండ సోకితే నల్లబడే ‘ఫొటోక్రోమ్‌’ జోడు ఎంచుకోవాలి. ఈత సమయంలో పెట్టుకోవలసిన కళ్లజోళ్లు కూడా ఉంటాయి. ఈత కొలనులో ఉండే నీటిలో క్లోరిన్‌ కలిసి ఉంటుంది. దీంతోపాటు ఎన్నో రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలు కూడా ఉండే వీలుంటుంది. ఇవేవీ కళ్లలోకి చొరబడకుండా ఉండాలంటే తప్పనిసరిగా స్విమ్మింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకోవాలి.

Updated Date - Dec 11 , 2025 | 05:41 AM